-->

ఐపీఓకు వస్తోంది సోనా కామ్ స్టర్

2021-01-08 08:02:51

img

ఐపీఓకు వస్తోంది సోనా కామ్ స్టర్
4వేల కోట్లు సమీకరణకు రెడీ
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆధార్ IPO?

అమెరికాకు చెందిన అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ కంపెనీల్లో ఒక్కటైన బ్లాక్ స్టోన్ కంపెనీ నియంత్రిత వాటా కలిగిన ఆటో కాంపోనెంట్ కంపెనీ సోనీ కామ్ స్టర్ ద్వారా ఇన్సియల్ పబ్లిక్ ఆఫరింగ్ - IPOకు వస్తోంది. 2021లోనే వచ్చే ఛాన్సుందని కంపెనీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పక్టస్ కూడా ఫబ్రవరిలో సమర్పించనుంది. దీనికి సంబంధించి కోటక్ మహీంద్రా కేపిటల్, JM ఫైనాన్షియల్, క్రెడిట్ స్యూస్ కంపెనీలు అడ్వైజరీ సంస్థలుగా నియమించింది. రూ.3500 కోట్ల నుంచి 4వేల కోట్ల మధ్య నిధులు సమీకరించే అవకాశం ఉంది. ఇంకా ఐపీఓ సైజుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  
సోనీ ప్రొఫైల్...
సోనీ కామ్ స్టర్ 2024 నాటికి టాప్ 4 ఆటో కాంపొనెంట్ కంపెనీల్లో ఒక్కటిగా ఎదగాలని లక్ష్యం పెట్టుకుంది. కంపెనీకి ప్రస్తుతం 9 యూనిట్లు ఉన్నాయి. ఇండియా, చైనా, మెక్సికో, అమెరికా దేశాల్లో ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి. 2019లో కంపెనీ 1900 కోట్ల ఆదాయన్ని చూపించింది. 2024 నాటికి బిలియన్ డాలర్ రెవిన్యూ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి ఫోర్డ్, దైమ్లర్, టాటా, అశోక్ లాలేండ్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నారు. ఫోర్జ్డ్ గేర్స్ లో అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒక్కటిగా ఉంది. 2026 నాటికి మనదేశం నుంచి 80బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉంటాయని అంచనా. కంపెనీలో ప్రస్తుతం 65శాతం స్టేక్ బ్లాక్ స్టోన్ కంపెనీకి ఉంది. 35శాతం సంజయ్ కపూర్ కు ఉంది.

ఇండియాలో బ్లాక్ స్టోన్...
బ్లాక్ స్టోన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్టర్ నేటివ్ అసెట్ మేనేజర్. ఇండియాలో అతిపెద్ద కమర్శియల్ రియల్ ఎస్టేట్ అసెట్ వాల్యూ కలిగిన సంస్థ. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆధార్ హౌసింగ్ ద్వారా IPOకు వస్తోంది.
బ్లాక్ స్టోన్ కంపెనీ దేశంలో చాలాకాలంగా పెట్టుబడులు పెడుతోంది. మొదటిసారిగా 2015 అక్టోబర్ లో ఫ్రాగ్నన్స్ మేకర్ SH Kelkar ద్వారా ఐపీవో కు వచ్చింది. తర్వాత REIT విభాగంలో కూడా IPO కు వచ్చింది. ఏప్రిల్ 2019లో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ద్వారా వచ్చింది. తర్వాత మళ్లీ 2020లో రహేజా కంపెనీ ద్వారా మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ పేరుతో REIT  IPO తో వచ్చింది.