4500 కోట్ల IPOతో వస్తున్న అదానీ గ్రూప్ కంపెనీ

2021-08-02 21:58:29 By Y Kalyani

img

4500 కోట్ల IPOతో వస్తున్న అదానీ గ్రూప్ కంపెనీ

కార్పొరేట్ రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తోంది అదానీ గ్రూప్. లిస్టెడ్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. టేకొవర్లతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. తాజాగా మరో సంచలనానికి సిద్దమయ్యారు. అదే Adani Wilmerకంపెనీ IPO.
2027 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విల్మర్ ప్రైమరీ మార్కెట్ నుంచి దాదాపు రూ.4500 కోట్లకు పైగా సమీకరించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అదానీ గ్రూపునకు చెందిన 6 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇది 7వ కంపెనీగా మారుతుంది. 
ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ ఫార్చ్యూన్ ను తయారుచేసే ఈ సంస్థను 1999 లో అదానీ గ్రూప్ మరియు ఆసియాలోని ప్రముఖ వ్యవసాయ-ఆధారిత సింగపూర్ కంపెనీ విల్మార్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశారు. బాస్మతి బియ్యం, అట్టా, మైదా, పప్పుధాన్యాలు మరియు బేసాన్ వంటి ఇతర విభాగాలలోకి వైవిధ్యభరిత ఉత్పత్తులు అందిస్తోంది. అదానీ విల్మార్‌కు 8 బిలియన్ డాలర్ల నుండి 9 బిలియన్ డాలర్ల వాల్యూ ఉంటుందని చెబుతున్నారు.
కంపెనీ వెబ్ సైట్ ప్రకారం అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది. 85 స్టాక్ పాయింట్లు, 5000 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. 1.5 మిలియన్ అవుట్ లెట్లలో కంపెనీ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. 10శాతం మార్కెట్ వాటా సంపాదించింది. ప్రతిరోజూ 16800 టన్నుల ఉత్పత్తి చేసే 22 యూనిట్లున్నారు. కంపెనీ రెవిన్యూ మొత్తం 30వేల కోట్లు దాటింది. ఇందులో ఎడిబుల్ ఆయిల్స్ నుంచే సుమారు రూ.24వేల కోట్లు వస్తుందని కంపెనీ ప్రకటించింది. సంస్థ వ్యాపారం డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుందని చెబుతోంది. 


adani port adani port latestnews adani group

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending