IPOకు సిద్దమవుతున్న అదానీ ఎయిర్ పోర్టు కంపెనీ

2021-06-10 08:58:37 By Y Kalyani

img

IPOకు సిద్దమవుతున్న అదానీ ఎయిర్ పోర్టు కంపెనీ 

ఆసియా కుబేరుల జాబితాలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న గౌతమ్ అదానీ సారథ్యంలోని పలు కంపెనీలు కొత్తగా లిస్టింగ్ కు సిద్దమవుతున్నాయి. 
ఇప్పటికే మార్కెట్లో 6 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. తాజాగా కన్జూమర్ కంపెపీ అదానీ విల్మార్ కూడా లిస్ట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. సుమారు 7వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా మరో కంపెనీ కూడా ప్రిలిమినరీ దశలో ఉంది. అదే అదానీ ఎయిర్ పోర్టు కంపెనీ.  దీనికి సంబంధించి త్వరలోనే మార్కెట్లో లిస్టింగ్ చేయాలని నిర్ణయించారు. దాదాపు 500 మిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ప్రైవేటు ప్లేస్ మెంట్ షేర్ల ద్వారా హోల్డింగ్ ఇస్తారని తెలుస్తోంది. కంపెనీ మార్కెట్ వాల్య 4బిలియన్ డాలర్లు వరకూ ఉంటుందని అంచనా. అంటే 25వేల నుంచి 30వేల కోట్ల ఉంటుందని కంపెనీ వర్గాలంటున్నాయి. 

ఎయిర్ పోర్టువిభాగంలో..
అదానీ గ్రూపు ఇప్పటికే ముంబై ఎయిర్ పోర్టు చేజక్కించుకుంది. దేశంలో రద్దీగా ఉండే అతిపెద్ద రెండో విమానాశ్రయం ఇది. మరో 6 విమానాశ్రయాలను కూడా నిర్వహణకు కంపెనీ ఒప్పందాలు చేసుకుంది. ఇందులో జైపూర్, కొచ్చి, తిరువునాంతపురం, చెన్నై వంటి ఎయిర్ పోర్టులున్నాయి. 

ఏది ఏమైనా తాజా లిస్టింగ్ లతో గౌతమ్ అదానీ.. సంపదతో అంబానీని మించేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య తేడా కేవలం 6 బిలియన్ డాలర్లు మాత్రమే. అంబానీ ఆస్తి 74 బిలియన్ డాలర్లు ఉండగా.. అదానీ సంపద 68బిలియన్ డాలర్లుగా ఉందని బ్లూమ్ బర్గ్ ప్రకటించింది. ప్రస్తుతం అంబానీ ప్రపంచంలో కుబేరుల జాబితాలో 12వస్థానంలో ఉంటే.. అదానీ 13వ స్థానంలో ఉన్నాడు.  


adani ports adaniports tekeover apsez profit tradings green energy adani gas

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending