318 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన పరాస్ డిఫెన్స్ ఐపీఓ..

2021-09-24 10:39:00 By VANI

img

పరాస్ డిఫెన్స్ స్పేస్ టెక్నాలజీస్ ఐపీఓ 318 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.  రూ.38,021 కోట్ల విలువైన బిడ్‌లను జనరేట్ చేసింది. దీంతో పరాస్ నయా రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో 273 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో సలాసర్ టెక్నాలజీస్ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ రికార్డును పరాస్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఐపీఓ అధిగమించి.. అత్యధికంగా సబ్‌స్క్రైబ్ చేయబడిన IPO గా నిలిచిందని మార్కెట్ నిపుణులు తెలిపారు.

 

సంస్థకు చెందిన ఐపీఓ 3.6 మిలియన్ రిటైల్ అప్లికేషన్లను చూసింది. ఇష్యూ యొక్క రిటైల్ భాగం 118 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అయితే సంస్థాగత భాగం 175 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ని పొందింది. దాదాపు 25,000 కోట్ల బిడ్‌లతో హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (HNI) పోర్షన్ 974 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అనధికారిక గ్రే మార్కెట్‌లో పరాస్ డిఫెన్స్ షేర్‌ల కోసం 80 శాతం ప్రీమియం మధ్య ఫ్రెంజిడ్ అప్లికేషన్ ఉంది. పరాస్ డిఫెన్స్, స్పేస్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, సొల్యూషన్స్ తయారీ, టెస్టింగ్‌లో నిమగ్నమై ఉంది.

 

ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఒక్కో షేరుకు రూ.165-175. టాప్-ఎండ్‌లో పరాస్ డిఫెన్స్ రూ.683 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉంది. కంపెనీ ఐపీఓ రూ.140.6 కోట్ల తాజా నిధుల సేకరణతో పాటు.. రూ.30.2 కోట్ల ద్వితీయ వాటా విక్రయాన్ని కలిగి ఉంది. మార్చి 2021తో ముగిసిన సంవత్సరానికి పరాస్ డిఫెన్స్ రూ.143 కోట్ల ఆదాయాలపై రూ.16 కోట్ల నికర లాభాన్ని గడించింది.


Paras Defence  IPO  

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending