IPOకు వస్తున్న ఇండియన్ రిటైల్ ఈ కామర్స్..

2021-04-07 09:39:00 By Y Kalyani

img

IPOకు వస్తున్న ఇండియన్ రిటైల్ ఈ కామర్స్

వాల్మార్ట్ ఇంక్ నియంత్రణలో ఉన్న భారతీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ సంవత్సరం 4వ త్రైమాసికంలోనే IPOకు వచ్చేందుకు ప్రయత్నాల్లో ఉంది. యు.ఎస్. రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కోసం అంతర్గతంగా ఐపిఓ కోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసింది. లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఫ్లిప్‌కార్ట్ విలువ 35 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

ఫ్లిప్‌కార్ట్ 2007లో స్థాపించబడింది. 11 సంవత్సరాల తరువాత అమెరికన్ రిటైలర్ అతిపెద్ద సంస్థ వాల్‌మార్ట్ దీనిని కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్యాషన్ రిటైలర్ మైంట్రా కూడా భాగంగా ఉంది. 300 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 80 కి పైగా విభాగాలలో 150 మిలియన్లకు పైగా ఉత్పత్తులు విక్రయిస్తోంది. 
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending