ఇవాళే జొమాటో ఐపీఓ షేర్ల కేటాయింపు, అప్లికేషన్‌ స్టేటస్‌ ఇలా తెలుసుకోండి..

2021-07-22 10:46:18 By Marepally Krishna

img

జొమాటో మెగా ఐపీఓలో ఇవాళ షేర్ల కేటాయింపు ఫైనలైజ్‌ అయ్యే అవకాశముంది. రూ.9400 కోట్ల నిధుల సేకరణ కోసం ఐపీఓకు వచ్చిన ఈ ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ 38 కోట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 7.45 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కాగా క్యూఐబీ పోర్షన్‌లో చక్కని రెస్పాన్స్‌(54 రెట్లు) లభించింది. ఇక నాన్‌ ఇనిస్టిట్యూలషనల్‌ విభాగంలో 35 రెట్లు అధికంగా బిడ్స్‌ వచ్చాయి. 


186 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి జొమాటో సంస్థ రూ.4196 కోట్ల నిధులను సమీకరించింది. ఇష్యూ కటాఫ్‌ ధర రూ.76 కాగా గ్రేమార్కెట్‌ ప్రీమియం రూ.23గా సూచిస్తోంది. అంటే ఈ స్టాక్‌ దాదాపు రూ.100 సమీపంలో ఈ స్టాక్‌ లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ ఐపీఓ కేటాయింపు, అప్లికేషన్‌ స్టేటస్‌లను దిగువ లింక్‌లో తెలుసుకోవచ్చు.

జొమాటో ఐపీఓలో షేర్ల కేటాయింపు, అప్లికేషన్‌ స్టేటస్‌ కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి.


bse nse sensex nifty stock market telugu