ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టారు..! పాక్ టీంపై జొమాటో ఒక్క ట్వీట్‌తో రచ్చరంబోలా...

2021-10-24 18:51:32 By VANI

img

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. మరికాసేపట్లో దాయాదుల పోరుకు దుబాయ్ వేదిక కానుంది. టీ20వరల్డ్‌కప్‌-2021లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. క్రికెట్ మొత్తం ఒక ఎత్తైతే.. దానిలో భారత్-పాక్ మ్యాచ్ ఒక ఎత్తు. సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్, సెటైర్స్ హోరెత్తుతున్నాయి. తామేమైనా తక్కువ తిన్నామా.. అన్నట్టుగా నెటిజన్లకు తోడుగా జొమాటో కూడా వచ్చి జాయిన్ అయింది. నిన్న సాయంత్రం జొమాటో చేసిన ఈ ట్వీట్ చాలా ఆసక్తికరంగా మారింది.

 

అసలేం జరిగిందంటే..

 

ఒకప్పుడు అంటే 2019లో వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. దీంతో చాలా హర్ట్ అయిన మోమిన్ సాకిబ్ అనే పాక్ అభిమాని ఓ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ ప్లేయర్స్‌లో ఒక్కరికి కూడా ఫిట్‌నెస్ లేదని చెబుతూ.. ‘యే లోగ్‌ కల్‌ రాత్‌  ఐస్‌క్రీమ్‌ ఖా రహే.. బర్గర్‌ ఖా రహే’ అని తెలిపాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ ట్వీట్‌ను దృష్టిలో పెట్టుకునే జొమాటో పాక్‌ను దారుణంగా ట్రోల్ చేసింది. 

 

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జోమాటో కూడా చేరింది. జోమాటో తన అధికారిక ట్విట్‌లో...‘ఈ  రోజు(అక్టోబర్‌ 23) రాత్రి బర్గర్‌, పిజ్జా కావాలంటే మాకు చెప్పండి. ఒక్క మేసెజ్‌ చేస్తే అవి మీకు అందిస్తాం’ అని పాకిస్తాన్‌ క్రికెట్‌ ట్విటర్‌ అధికార ఖాతాను ట్యాగ్‌ చేసి మరీ ట్వీట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్లు, సెటైర్లతో రెచ్చిపోతున్నారు. 2019 వరల్డ్ కప్‌ని టీ20వరల్డ్‌కప్‌-2021తో లింక్ పెట్టి ట్వీట్ చేయడం వెనుక జొమాటో సెన్సాఫ్ హ్యూమర్‌ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.


Zomato  Pakistan  India  Cricket match 

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending