Capco ను సొంతం చేసుకున్న Wipro

2021-03-04 23:34:54 By Y Kalyani

img

Capco ను సొంతం చేసుకున్న Wipro
డీల్ వాల్యూ 1.45 బిలియన్ డాలర్లు
లండన్ కు చెందిన పెద్ద కంపెనీల్లో ఒకటి విప్రో సొంతం

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలోని కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ అయిన Capco ను సొంతం చేసుకుంది. డీల్ వాల్యూ 1.45 బిలియన్ డాలర్లు. విప్రో కంపెనీ చరిత్రలో అతిపెద్ద టేకొవర్ గా చెబుతున్నారు. లండన్ కు చెందిన కేపిటల్ మార్కెట్స్ కంపెనీ Capco మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీ సంస్థ. గ్లోబల్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ రంగంలో అవసరమైన డిజిటల్ సర్వీసులు అందిస్తోంది. తాజా డీల్ తో విప్రో బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSI విభాగంలో లీడర్ గా ఎదిగేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. 
Capco కంపెనీలో 5వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 ప్రదేశాల్లో కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఈ ఒప్పందం జూన్ 30, 2021 నాటికి పూర్తి చేయనున్నారు. త్వరలోనే రెగ్యులేటరీ అనుమతులు రానున్నాయి.
అంతకుముందు విప్రో కంపెనీ బెల్జియంకు చెందిన IVIA సర్వీస్ ను 790 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. అక్టోబర్ కూడా Eximius Design కంపెనీని కూడా 80 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. చిన్నచిన్న కంపెనీలు దాదాపు 10 వరకూ కంపెనీ సొంతం చేసుకుంది. ఇటీవల కొత్త కొత్త దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కంపెనీ అనేక ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా టేకొవర్లు చేస్తోంది.

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending