వాట్సాప్ డ్యూడ్..! ఫోనే కాదు,సిస్టమ్ నుంచి కూడా కాల్స్ చేసుకోవచ్చు!

2021-03-04 17:32:01 By Anveshi

img


వారెవ్వా ! ఒకప్పుడు వాట్సాప్ అంటే కొంతమందికి మాత్రమే పరిమితం. ఇప్పుడో స్మార్ట్ ఫోన్ వాడనివారు ఈ యుగానికి చెందినవాళ్లు కాదన్నట్లుగా తయారైంది సిచ్యుయేషన్. వాయిస్ కాల్స్ మానేసి వాట్సాప్ కాల్సే ఎక్కువగా చేస్తోన్న తరుణం. కారణం  ఒకటే ఫోన్‌లో మాటలే. అదే వాట్సాప్ అయితే వీడియో కాల్స్ కూడా చేసుకోగలగడం!

మరి ఇప్పుడు వాట్సాప్ రీసెంట్‌గా పేమెంట్ సర్వీసులు ప్రారంభించింది. దాంతోపాటే ఇక డెస్క్‌టాప్ నుంచి కూడా వీడియోకాల్స్, ఫోన్ కాల్స్, చేసుకునే ఫెసిలిటీ తీసుకురాబోతోంది. నిజంగా మంచి కిక్కిచ్చే న్యూస్ కదా..! ఎందుకంటే, ఎంత మొబైల్ ఫోన్ అయినా కాస్తో కూస్తో స్క్రీన్ సైజ్ దగ్గర కాంప్రమైజ్ అయినట్లే అదే ఇక డెస్క్‌టాప్ కాల్స్ అంటే చెప్పక్కర్లేదు ఏకంగా ఎదుటోళ్లకి సినిమాలే చూపించొచ్చు

ప్రస్తుతానికి ఇది గ్రూప్ కాల్స్‌ కాదు కేవలం సింగిల్ టూ సింగిల్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కుదురుతుందని ప్రకటించింది. తొందర్లోనే గ్రూప్ కాలింగ్‌కి కూడా సై అంటామని అప్పటిదాకా ఓపిక పట్టాలని సూచించింది. అంతేకాదు దీనికో రీజన్ ఉంది గురూ అంటోంది, కస్టమర్లకు హై క్వాలిటీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడమే తమ టార్గెట్ కాబట్టి, ముందు ట్రయల్ దశలో ఇలా వన్ టూ వన్ కాల్ ఆప్షన్ ఇచ్చినట్లు వీలైనంత తొందరగా గ్రూప్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని హామీ ఇచ్చింది. 

 డెస్క్‌టాప్ వాట్సాప్ కాలింగ్ కి ఈ కింద కండిషన్స్ మస్ట్

 

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి

64 బిట్ వెర్షన్ 1903 రిజల్యూషన్ 

విండోస్ వెబ్ కెమెరా, మైక్రోఫోన్

ఈ రెండు ఆప్షన్లకూ యాప్ పర్మిషన్లలోకి వెళ్లి పర్మిషన్ ఇవ్వాలి

 డెస్క్‌టాప్ యాప్‌లోనే ఈ ఫీచర్ పని చేస్తుంది. అంతేకానీ వెబ్ వాట్సాప్ వెబ్ వెర్షన్ లో పని చేయదు 

ఇక విండోస్ వాడేవాళ్లు మీది ఏ వెర్షనో తెలుసుకోవాలంటే విండోస్ కీ ప్రెస్ చేయండి ..సెర్చ్ ప్లేస్‌లో winver అని టైప్ చేయండి మీ విండోస్ ఐకాన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ వెర్షన్ తెలిసిపోతుంది లేదంటే విండోస్10కి అప్ గ్రేడ్ అయిపోవడమే 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending