కంగనా రనౌట్..! అక్కౌంట్ పర్మినెంట్‌గా పీకి పారేసిన ట్విట్టర్

2021-05-04 17:43:45 By Anveshi

img

హిందీ చిత్రనటి కంగనా రనౌత్ కాంట్రవర్షియల్ కామెంట్లు, వీడియోలు పదే పదే షేర్ చేస్తుండటంతో ట్విట్టర్ ఆమె అక్కౌంట్‌ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఐదుసార్లు ఆమె చేసిన కామెంట్లు కానీ పోస్టులు కానీ ట్విట్టర్ బ్లాక్ చేసింది. 

ప్రతి ఒక్కరికీ సొంతంగా అభిప్రాయాలు ఉండొచ్చు. అలానే తమకి నచ్చిన పార్టీలపై మక్కువ ప్రదర్శించవచ్చు. ఐతే ఆ సాకుతో ఇతరులపై అదే పనిగా బురద జల్లి, అదే మేధావితనం అనుకోవాలంటే కుదరదు కదా, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అక్కడి మీడియాతో పాటు ఈమె చేసిన హడావుడి తక్కువ కాదు. అక్కడికేదో అంతా చూసినట్లు కొన్ని ఛానళ్లు ఎంక్వైరీ ఎలా చేయాలో. ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా డిసైడ్ చేస్తే ఇంకొందరు ఎవరిచేత దర్యాప్తు చేయాలో కూడా చెప్పారు. ఐతే చివరికి అతను చనిపోయింది ఆత్మహత్యద్వారానే అని తేల్చేశారు. అప్పట్నుంచి కంగన కామెంట్లలో పక్షపాతం అందరికీ కన్పించడం ప్రారంభమైంది. 


తాజాగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనలపై తన వీడియో కామెంట్లు షేర్ చేసిందీమె. ఇది వయలెన్స్‌ని రెచ్చగొట్టేలా ఉండటంతో ట్విట్టర్ ఆమె అక్కౌంట్‌ని పర్మినెంట్‌గా డిజేబుల్ చేసింది. ఆరు నెలల క్రితమే ఈమె చెల్లి రంగోలి అక్కౌంట్‌ని కూడా ట్విట్టర్ డిలీట్ చేసింది

ఐతే కంగన మాత్రం,తనకి ఇంకా చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయంటూ అదే వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది


twitter kangana manikarnika delete account telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending