సరికొత్త రంగులతో TVS Radeon.. రూ.68,982 ధర ప్రారంభం...

2021-10-23 14:33:10 By VANI

img

TVS మోటార్ తన Radeon మోడల్‌ను రెండు సరికొత్త రంగులలో విడుదల చేసింది. పండుగ సీజన్‌కు ముందు బైక్ రెండు అదనపు పెయింట్ స్కీమ్‌లను అందుకుంది. ఈ రెండు వేరియంట్‌లు రేడియన్ అమ్మకాలను పెంచుతాయని కంపెనీ భావిస్తోంది. TVS Radeon ఇప్పుడు కొత్త బ్లూ అండ్ బ్లాక్ ఆప్షన్‌తో పాటు రెడ్ అండ్ బ్లాక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇక కలర్ విషయాన్ని పక్కనబెడితే... బైక్ మెకానికల్‌గా, అలాగే చూడటానికి మంచి లుక్‌తో అదిరిపోతుంది. 

 

బైక్‌కి ఒక వైపున రేడియన్ డెకాల్ అలాగే బాడీ కలర్‌కు మ్యాచ్ అయ్యే హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ని పొందుపరిచారు. స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే కొత్త డ్యూయల్-టోన్ ఆప్షన్‌ల ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. బైక్ యొక్క డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ.68,982 కాగా డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర రూ.71,982. డ్యూయల్-పెయింట్ ఆప్షన్స్‌‌ను కొనుగోలు చేసిన 4 లక్షల మంది కస్టమర్‌లతో రేడియాన్ పండగ చేసుకుంటోంది. 

 

కొత్తగా యాడ్ అయిన రెండు రంగులతో కలిపి బైక్ ఇప్పుడు మొత్తం పది పెయింట్ ఆప్షన్స్‌లో ఆఫర్ చేయబడుతోంది. ఈ బైక్ 109.7cc 4-స్ట్రోక్ డ్యూరా-లైఫ్ ఇంజిన్‌తో తయారు చేయబడింది. దీనికి 18-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. బైక్ టెలిస్కోపిక్ ఆయిల్ డంప్డ్ ఫ్రంట్ ఫోర్క్స్, 5 స్టెప్ అడ్జస్టబుల్ రేర్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌‌తో తీసుకురాబడింది. బైక్ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1265 మిమీ వీల్ బేస్‌తో తయారు చేయబడింది. 


TVS Radeon  

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending