TCS పేరు మార్మోగుతోంది.. ఎవరి లెక్కలేంటి

2021-01-28 10:12:09 By Y Kalyani

img

TCS పేరు మార్మోగుతోంది.. ఎవరి లెక్కలేంటి

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు TCS మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్స్‌లో మూడవ స్థానం చేజిక్కించుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకోగా.. మన దేశీ కంపెనీ మూడోస్థానానికి చేరింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌–2021 నివేదికలో తెలిపింది. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా టాప్‌–10లో భారత్‌ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో ఉన్నాయి. టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్‌ డాలర్లు పెరిగి 14.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. 25 గ్రోత్ సాధించి ఐటీ కంపెనీల్లో మేటిగా నిలిచింది. 

ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా యాక్సెంచర్‌ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్‌ వాల్యూ 26 బిలియన్‌ డాలర్లు. రెండవ స్థానాన్ని పదిలపర్చుకున్న ఐబీఎం బ్రాండ్‌ విలువ 16.1 బిలియన్‌ డాలర్లు. ఇక కాగ్నిజెంట్‌ను దాటి నాల్గవ స్థానానికి ఇన్ఫోసిస్‌ ఎగబాకింది. ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ విలువ 19 శాతం పెరిగి 8.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కాగ్నిజెంట్‌ బ్రాండ్‌ విలువ 6 శాతం తగ్గి 8 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్‌7, విప్రో9, టెక్‌ మహీంద్రా15వ స్థానానికి చేరాయి.

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending