టాటా మోటర్స్‌కి కరోనా పంక్చర్..! Q4లో ఫసక్ అయిన ప్రాఫిట్

2021-05-18 21:43:52 By Anveshi

img

సేల్స్ అదరగొట్టినా, కరోనా పంక్చర్ వేయడంతో టాటా మోటర్స్‌ భారీగా నష్టం ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో FY2021 q4లో రూ.7605.4కోట్ల నష్టం మూటగట్టుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఐతే రెవెన్యూ మాత్రం 42శాతం గ్రోత్ రికార్డ్ చేసి అంచనాలను అందుకోగలిగింది

 

గత ఏడాది ఇదే సమయంలో కన్సాలిడేటెడ్‌గా రూ.9894.25కోట్ల నష్టం వాటిల్లగా,డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో మాత్రం రూ.2906.45కోట్ల లాభం గడించడం గమనార్హం. నిర్వహణ పరమైన ఆదాయం 41.8శాతం వృద్ధితో  రూ.88,627.9కోట్లకి ఎగసింది. కొన్ని సంస్థలు టాటామోటర్స్ కనీసం రూ.2700కోట్లైనా  లాభం ప్రకటిస్తుందనే అంచనాలు వేయగా అవన్నీ మిస్ చేసింది టాటామోటర్స్.

 

అసెట్ రైట్ డౌన్స్, జాగ్వార్ లాండ్ రోవర్‌కి సంబంధించిన రీస్ట్రక్చరింగ్ ఖర్చులన్నీ తడిసి మోపెడవండతో, బాటమ్‌లైన్
రూ.14994.30కోట్లకి పరిమితం అయింది

 

దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా డిమాండ్ బ్రహ్మాండంగా ఉన్నా, లాక్‌డౌన్లు, సప్లై చైన్ డిస్ట్రబెన్స్ మరి కొన్ని నెలలు వేధించడం ఖాయంగా కన్పిస్తోంది.దీనికి తోడు కమోడిటీ ధరల పెరుగుదల కూడా భవిష్యత్తులో ఆదాయంపై ప్రభావం చూపించనుందని, టాటా మోటర్స్ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఏడాది 2022 సెకండ్ క్వార్టర్లో తప్ప ఇప్పట్లో పెద్దగా మెరుపులు ఉండబోవని కంపెనీ మాటల్లోనే అర్ధమవుతోంది.
 


tata motors tamo lose jlr sales telugu profit trade

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending