డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్ట్రాంగ్‌గా ఉండటంతో ఇవాళ టాటా ఎలాక్సీ స్ట్రాంగ్‌గా కదలాడుతోంది. ఇంట్రాడేలో షేర్ 11 శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి రూ.2300కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం విశేషం. ప్రస్తుతం 8.5శాతం లాభంతో రూ.2264 వద్ద షేర్ ట్రేడవుతోంది. ఇవాళ ఎన్ఎస్ఈలో ఇప్పటివరకు 22.75 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,070 కోట్లుగా ఉంది.
ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టాటా ఎలాక్సీ ఆర్థిక ఫలితాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం ఆదాయం QoQలో 10.9శాతం వృద్ధితో రూ.477 కోట్లకు చేరింది. ట్రాన్‌పోర్ట్, బ్రాడ్కాస్ట్, కమ్యూనికేషన్, హెల్త్‌కేర్ రంగాల్లో ఈ కంపెనీ చక్కని ప్రదర్శనను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్ 300 బేసిస్ పాయింట్లు పెరిగి 27.8 శాతానికి చేరింది. ఇక కంపెనీ నికరలాభం 33.3శాతం వృధ్ధితో రూ.105 కోట్లుగా నమోదైంది.