తీపితగ్గిన షుగర్‌ స్టాక్స్‌

2022-06-20 14:17:23 By Marepally Krishna

img

చక్కెర ఎగుమతులపై కేంద్రం గరిష్ట పరిమితి విధించే యోచనలో ఉంది. దీంతో ఇవాళ షుగర్‌ స్టాక్స్‌ భారీ ఒత్తిడికి లోనవుతోన్నాయి. ముఖ్యంగా బల్‌రామ్‌పూర్‌ చిని 7శాతంనష్టంతో రూ.340 వద్ద, ధంపూర్‌ షుగర్స్‌ 10శాతం నష్టంతో రూ.203 వద్ద, రేణుకా షుగర్స్‌ 11శాతం పైగా నష్టంతో రూ.40 వద్ద ట్రేడవుతోన్నాయి. మిగిలిన షుగర్స్‌ స్టాక్స్‌లో మెజార్టీ కంపెనీలు అమ్మకల ఒత్తిడికి లోనవుతోన్నాయి. 


కారణమిదే?
వరుసగా రెండో సంవత్సరం చక్కెర ఎగుమతులపై కేంద్రం గరిష్ట పరిమితి విధించబోతోంది. ఈ అక్టోబర్‌లో ప్రారంభమయ్యే సీజన్‌తో ఈ నిర్ణయం అమమల్లోకి వస్తుందని  రాయిటర్స్‌ తమ తాజా కథనంలో తెలిపింది. 2022-23 అక్టోబర్‌ - సెప్టెంబర్‌సీజన్‌లో చక్కెర ఎగుమతులు 5-7 మిలియన్‌ టన్నులకు పరిమితం చేసే అవకాశముంది. ప్రస్తుత సీజన్‌లో మొత్తం ఎగుమతుల కంటే ఇది మూడింట ఒక్కవంతు తక్కువగా ఉంది. 


bse nse stock market bull bear loss profit trading Telugu News