గత కొద్ది రోజులుగా ఫార్మా రంగ షేర్లు పరుగులు పెడుతుంటే, వాటిలో మన హైదరాబాదీ కంపెనీలు కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాయ్. వాటిలో కొంతకాలంగా డల్‌గా ఉన్న sms లైఫ్ సైన్సెస్ ఇవాళ ఒక్కసారిగా భారీగా పెరిగింది. బుధవారం ఈ కంపెనీ షేర్లు 20శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.625.60కి ఎగశాయ్.
ఈ స్టాక్ గత డిసెంబర్ నుంచి కరెక్షన్ మోడ్‌లో ఉండగా ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లకు పండగ చేసింది. 2020 డిసెంబర్ 1న రూ.580.75 ఉన్న ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ షేరు ధర అదే వారంలో అంటే డిసెంబర్ 7న రూ.694.15కి ఎగసింది. ఆ తర్వాత నుంచి మాత్రం స్తబ్దుగా ఉండిపోయింది. కరెక్షన్‌కి గురవుతూ, రూ.489కి కూడా పతనమైంది. ఐతే ఇవాళ్టి ట్రేడింగ్లోమాత్రం ఒక్కసారిగా జూలు విదిల్చినట్లుగా ఏకంగా 20శాతం పెరిగింది. కారణాలేవో తెలీడం లేదు కానీ, గత నాలుగైదు నెలల్లో లేని జంప్ ఒక్క రోజే నమోదు చేసింది.బహుశా ఫార్మారంగ స్టాక్స్ ర్యాలీ సెగ ఈ కంపెనీ షేరుకూ తాకినట్లుందని అంటున్నారు.
గతంలో ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ కలిసి ఉండగా, తర్వాత విడిపోయాయ్. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్‌ను టివివిఎస్ఎన్ మూర్తి లీడ్ చేస్తుండగా, ఎస్ఎంఎస్ ఫార్మా కంపెనీ పొట్లూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నడుస్తోంది. మరోవైపు ఎస్ఎంఎస్ ఫార్మా షేర్లు కూడా ఇవాళ ఇంట్రాడేలో దాదాపు 5శాతం పెరిగి రూ.141.95ని తాకాయి. ఇప్పుడు మూర్తిగారి కంపెనీ షేర్లలో ర్యాలీ ప్రారంభం కావడంతో రేసులోకి వచ్చినట్లైంది. మరి వ్యాపారం విషయంలోనూ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్, ఎస్ఎంఎస్ ఫార్మాని అందుకుంటుందో లేదో చూడాలి.