సెబీకి సమాచారం ఇవ్వకుండా షేర్ల క్రయవిక్రయాలు.. టైటాన్ ఉద్యోగులకు నోటీసులు.. 

2021-09-24 09:50:38 By VANI

img

ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ ఆరోపణల నేపధ్యంలో...  వాచ్ అండ్ జ్యూవెలరీ కంపెనీ ‘టైటాన్’ ఉద్యోగులకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా శుక్రవారం మానెటరీ పెనాల్టీ విధించింది. ఈ లావాదేవీ... 2018 ఏప్రిల్-2019 మార్చి మధ్య జరిగింది. రెగ్యులేటర్‌కు టైటాన్ నుంచి ఒక లేఖ అందింది. దీనిలో కంపెనీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ (పీఐటీ) నిబంధనల ఉల్లంఘన గురించి, దాని నియమించబడిన వ్యక్తులు, ఉద్యోగుల ద్వారా అంతర్గత ట్రేడింగ్ నిరోధానికి కంపెనీ ప్రవర్తనా నియమావళి గురించి తెలియజేసింది.

 

141 మంది ఉద్యోగులు ఆ వివరాలనివ్వకుండా షేర్లు కొన్నారన్న  సమాచారంతో సెబీ విచారణ జరిపించింది. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ జరిగినట్లు సెబీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. కంపెనీ ప్రమోటర్లు, ఉద్యోగులు, డైరెక్టర్లు... సంస్థలో రూ.10 లక్షల విలువకు మించిన షేర్ల క్రయవిక్రయాలు జరిపారు. అయితే దీనిని తప్పనిసరిగా కంపెనీకి తెలియజేయాల్సి ఉంది. అలాగే ఆయా లావాదేవీలకు సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇలాంటివేమీ చేయలేదన్న కారణంగా ‘టైటన్’ లో పనిచేస్తున్న 141 మంది ఉద్యోగులకు సెబీ నోటీసులు జారీ చేసింది. 


Sebi  Titan  Inside Trading  

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending