స్నైడర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్..! 13% ర్యాలీ చేసిన షేర్లు

2021-05-18 12:10:16 By Anveshi

img

ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ, డిజైనింగ్, బిల్డింగ్ కంపెనీ స్నైడర్ షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీగా పెరిగాయ్. మీడియం వోల్టేజ్ స్విచ్‌గేర్ల ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ సరఫరా చేసే ఈ కంపెనీకి ఆర్డర్ల బూస్ట్ దొరకడంతో పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ ఇస్తోంది.ఇంట్రాడేలో ఇప్పటికే 13శాతం పెరిగిన స్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు రూ.110.65కి ఎగసాయి

 

గుజరాత్‌లోని వడోదర బేస్డ్ కంపెనీ అయిన స్నైడర్ గతంలో బెంగళూర్‌తో పాటు రీజినల్ స్టాక్ ఎక్శ్‌ఛేంజ్‌లలో ట్రేడ్ అవుతూ డీలిస్టింగ్ అయింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టు జోక్యం కోరింది. ప్రస్తుతం క్యు4 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండగా ఇవాళ్టి మార్కెట్లలో మంచి జోరు కనబరచింది.

 

ప్రస్తుతం స్నైడర్ ఎలక్ట్రిక్ షేర్లు 10.74శాతం పెరిగి రూ.108.20 వద్ద ట్రేడవుతున్నాయ్
 


SCHNIEDER AUTOMATION ENERGY GRID TELUGU PROFIT TRADE

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending