ఇక మార్కెట్లలో ఈ సెగ్మెంట్‌ని తక్కువ చేసి చూడకూడదా..? ఇరగదీస్తోన్న ఇన్సూరెన్స్ షేర్లు ! రికార్డ్ రేటుకి ఎగబాకిన ఎస్‌బిఐ లైఫ్ 

2021-05-04 13:20:32 By Anveshi

img

ఇకపై ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా మార్కెట్లలో ఓ కంట కనిపెడుతూ ఉండాలా, ప్రాఫిట్ సైకిల్స్ నడిచే మార్కెట్లలో బ్యాంక్, ఐటీ, ఆటో, మెటల్, పార్మా రంగాల్లాగే బీమా రంగంలోని లిస్టెడ్ కంపెనీ షేర్లు కూడా  కాలానుగుణంగా పెర్ఫామ్ చేయడం ప్రారంభమైందా అంటే ఔననే చెప్పాలి. వరసగా హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాలు ఆర్ధికలాభాలు ఆర్జించిన తీరే ఇందుకు నిదర్శనం

 

క్యు4లో ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్దీ ప్రీమియం గ్రోత్, లాభాల్లో  మెరుగుదల, కొత్త వ్యాపారం మార్జిన్లు పెరగడం వంటి సానుకూల అంశాలతో మంచి ఫలితాలు ప్రకటించింది. 31శాతం ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్‌తో నెట్  ప్రీమియం రూ.15556 కోట్లకి ఎగసింది. అలానే న్యూ బిజినెస్ ప్రీమియం  63శాతం వృద్ధితో రూ.6187కోట్లకి చేరింది. రెన్యువల్ ప్రీమియం వేల్యూ  16శాతం వృద్ధితో రూ.9459కోట్లు వసూలు అయింది.అలానే AUM( అసెట్ అండర్ మేనేజ్‌మెంట్) 38శాతం వృద్ధితో రూ.220.870కోట్లకి చేరింది


ఈ ఆర్థిక ఫలితాల అండతో ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఇంట్రాడేలో  5శాతం పెరిగి రూ.1005కి చేరాయి. తద్వారా అక్టోబర్ 30.2019నాటి  రికార్డు ధరకి దగ్గరయ్యాయ్. అలానే 52వీక్స్ హై రేటుని క్రియేట్ చేసిన ఎస్‌బిఐ  ఇన్సూరెన్స్ కౌంటర్‌లో తర్వాతి దశలో ప్రాఫిట్ బుకింగ్‌ చోటు చేసుకుంది. దీంతో షేర్లు రూ.948కి కూడా చేరాయి.గత వారం రోజుల్లో sbi life insurance షేర్లు 8శాతం పెరగడం గమనార్హం. 

 

 ఇదే సమయంలో కంపెనీ ఆర్థిక ఫలితాలను విశ్లేషించిన ఐసిఐసిఐ  సెక్యూరిటీస్, న్యూ బిజినెస్ ప్రీమియం సీక్వెన్షియల్ పికప్ 13.8శాతం  రికార్డవగా, క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో రూ.6189కోట్లుగా నమోదు అయినట్లు  చెప్పింది, ప్రొటెక్షన్ బిజినెస్ బలమైన వృద్ధితో 840కోట్ల రూపాయలకు ఎగసింది. గత క్వార్టర్‌లో ఇది రూ.710కోట్లు. అలానే మేనేజ్‌మెంట్  ఎక్స్‌పెన్స్( ఖర్చు) నిష్పత్తి దాదాపు 2శాతం తగ్గి 8శాతానికి పరిమితమైందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది

 

ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగానే ఇన్సూరెన్స్ కంపెనీలకు బాగా  డిమాండ్ పెరిగిందనేది కాదనలేని నిజం, ఐతే భవిష్యత్తులోనూ ఆరోగ్యం పట్ల
బీమా పట్ల అవగాహన, పాలసీల ఆవశ్యకత  పెరుగుతున్న కారణంగా, మార్కెట్లలో బీమా సంబంధింత కంపెనీల స్టాక్స్‌పై ఓ కన్నేసి ఉంచాల్సిన
పరిస్థితి ఏర్పడింది 

 

(స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు 1.82శాతం పెరిగి రూ.976.60 వద్ద ట్రేడ్ అయ్యాయ్)


sbi life insurace hdfc icici securities rally q4 results telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending