వివిధ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే..? (JUNE 18)

2021-06-18 09:05:39 By Marepally Krishna

img

క్యూ-4 ఫలితాలు - పవర్‌ గ్రిడ్‌
నాల్గో త్రైమాసికంలో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆదాయంలో 4శాతం వృద్ధి

రూ.10,412.48 కోట్ల నుంచి రూ.10,510.23 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం

5శాతం వృద్ధితో రూ.3367.71 కోట్ల నుంచి రూ.3526.23 కోట్లకు పెరిగిన కంపెనీ నికరలాభం

4శాతం వృద్ధితో రూ.9295.54 కోట్లకు పెరిగిన ఎబిటా

87.9శాతం నుంచి 88.4శాతానికి పెరిగిన ఎబిటా మార్జిన్‌ 

ఒక్కో షేరుకు రూ.3 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసిన కంపెనీ బోర్డు


క్యూ-4 ఫలితాలు - ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌

నాల్గో త్రైమాసికంలో ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆదాయంలో 61శాతం వృద్ధి

రూ.1699.99 కోట్ల నుంచి రూ.2732.82 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం

34శాతం వృద్ధితో రూ.107.35 కోట్ల నుంచి రూ.143.84 కోట్లకు పెరిగిన కంపెనీ నికరలాభం

14శాతం వృద్ధితో రూ.263.44 కోట్లకు పెరిగిన ఎబిటా

13.6శాతం నుంచి 9.6శాతానికి తగ్గిన ఎబిటా మార్జిన్‌ 

ఒక్కో షేరుకు రూ.1.50 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసిన కంపెనీ బోర్డు

క్యూ-4 ఫలితాలు - J&K బ్యాంక్‌
నాల్గో త్రైమాసికంలో  J&K బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయంలో 7శాతం క్షీణత

రూ.987.28 కోట్ల నుంచి రూ.917.51 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం, రూ.316.74 కోట్లుగా నికరలాభం నమోదు

రూ.457.61 కోట్ల నుంచి రూ.28.27 కోట్లకు తగ్గిన ప్రొవిజన్స్‌


bse nse sensex nifty stock market sgx nifty telugu