ఒకే గొడుకు కిందకు గ్రామీణ బ్యాంకులు

2021-01-22 09:36:11 By Y Kalyani

img

ఒకే గొడుకు కిందకు గ్రామీణ బ్యాంకులు
రూరల్ బ్యాంకులపై బడ్జెట్ లో ఫోకస్

ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ బ్యాంకులపై ఫోకస్ పెట్టింది. రూరల్ బ్యాంకులను అన్నింటికీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి.. వాటిపై ఆజమాయిషీ సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందట. బడ్జెట్ 2021లో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 
పనితీరును పెంచడంతో పాటు.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం, మార్కెట్ నుంచి ఈక్విటీని పెంచడం కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఒకే హోల్డింగ్ కంపెనీగా మార్చే ఆలోచనలో ఉందట ప్రభుత్వం. 

దేశంలో ప్రస్తుతం 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులున్నాయి. 21,871 బ్రాంచులున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ ఒకే హోల్డింగ్ కంపెనీ కిందకు తెస్తే వీటి పనితీరు మెరుగుపడుతుందని ఆవిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే RBI, నాబార్డులతో కలిపి అధ్యయనం చేయడానికి కమిటీని వేశారు. నివేదిక కూడా వచ్చింది. 
సాధారణంగా వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, గ్రామీణ వ్యాపారాలకు ఈ బ్యాంకులు రుణాలు  ఇస్తుంటాయి. కేంద్రానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంక్‌కు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటాలు ఉంటాయి. మరి వచ్చే సంస్కరణల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి. 

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending