సిచ్యుయేషన్ సీరియస్, అన్ని రకాలుగా ఆదుకుంటాం! 35వేల కోట్ల G-సెక్ బాండ్ల కొనుగోలు, కోవిడ్‌ఇన్ఫ్రా కోసం రూ.50వేలకోట్లు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ కాలపరిమితి పెంపు:  ఆర్‌బిఐ గవర్నర్ స్పీచ్ హైలైట్స్

2021-05-05 10:34:06 By Anveshi

img

రూ.35వేలకోట్ల జి-సెక్ బాండ్ల కొనుగోలు
 అందుబాటులో రూ.50వేల కోట్ల లిక్విడిటీ
రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ కాలపరిమితి 36-50రోజులకు పెంపు
ఓ త్రైమాసికంలో 60 రోజుల వరకు కూడా వర్తింపు
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు  రెపోరేటుతో అందుబాటులో రూ.10వేలకోట్లు
ఎంఎఫ్ఐలకు అప్పులు ఇచ్చేందుకు అనుమతి

 

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోన్న వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాపారులతో సహా ఇండస్ట్రీలో
అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా కోవిడ్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రా వసతులు కల్పించేందుకు రూ.50వేల కోట్ల మేరు నిధులను బ్యాంకుల వద్ద రెపోరేటు వడ్డీతో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అలానే మన దగ్గర ఉన్న 588 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఫారెక్స్ నిధులు, జి-సెక్ ఆప్షన్లు చక్కగా వినియోగంలోకి వస్తాయన్నారు. గవర్నర్ శక్తికాంతదాస్  ఆర్బీఐ రూ.35వేల కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్ల కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

 

రాష్ట్రప్రభుత్వాలకు ఓవర్‌డ్రాఫ్ట్ పెసిలిటీ కూడా 36 రోజుల నుంచి 50 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ వరకూ ఓ మూడు నెలల కాలంలో ఎప్పుడైనా 60 రోజుల ఓవర్‌డ్రాఫ్ట్‌కి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అలానే బ్యాంకులకు  ఫ్లోటింగ్  ప్రోవిజన్లను 100శాతం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు 
అసెట్ సైజ్ రూ.500కోట్లు కలిగిన చిన్న MFIలకు అప్పులు ఇచ్చేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గడువు  పెంచారు. అలానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు మూడేళ్ల కాలపరిమితితో రూ.10వేలకోట్ల నిదులను రెపోరేటుతో  అందుబాటులో ఉంచనుంది. ప్రతి ఒక్క రుణం రూ.10లక్షల పరిమితితో స్మాల్ పైనాన్స్ బ్యాంక్ స్కీమ్ కింద దీన్ని అక్టోబర్ 31 వరకూ మంజూరు చేయవచ్చు గత ఏడాది ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన వన్ టైమ్  రీస్ట్రక్చరింగ్ కింద రూ.25కోట్ల స్కీమ్ వాడుకోని సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ వినియోగించుకునేందుకు వీలు కల్పించింది ఆర్బీఐ.

 

కోవిడ్‌ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చని అంచనా వేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస చెప్పారు. సిపిఐ ఇన్‌ఫ్లేషన్ మార్చి నెలలో  5.5శాతానికి పెరిగిందని, ఇది ఫిబ్రవరిలో 5శాతం ఉందని గుర్తు చేశారు. పప్పు దినుసులు, వంటనూనెల ధరలు పెరిగాయని, సాధారణ వర్షపాతం నమోదు కానుండటం ఈ ధరలను కాస్తైనా తగ్గిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు శక్తికాంతదాస్.

 

గత మార్చిలో వచ్చిన కరోనాని సమర్ధవంతంగా అరికట్టిన దేశం ఇప్పుడు మళ్లీ ప్రమాదం అంచులో ఉందంటూ ప్రసంగం ప్రారంభించిన శక్తికాంతదాస, ఇండస్ట్రీకి అవసరమైన అన్ని వనరులను రంగంలోకి దింపేందుకు, అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తామని భరోసా ఇచ్చారు
 


rbi monetary reserve fund governer sakthikantadas g-sec bonds buy liquidity

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending