-->

క్యూ3లో అదరగొట్టిన విప్రో... 2900 మంది ఫ్రెషర్స్ నియామకం

2021-01-13 19:48:08

img

అంచనాలు మించిన విప్రో ఫలితాలు
20శాతం పెరిగిన నెట్ ప్రాఫిట్

ఆర్థిక ఫలితాల్లో ఐటీ కంపెనీల ఫలితాల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ ఫోసిస్ కంపెనీలు మంచి లాభాలు పంచాయి. తాజాగా విప్రో కూడా అంచనాలు మించి లాభాలు ప్రకటించింది.  గత ఏడాదితో పోల్చితే 20.8శాతం అధికంగా నెట్ ప్రాఫిట్ చూపించింది.  డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ 2966 కోట్లు నెట్ ప్రాఫిట్ చూపించింది. 

 

గత ఏడాది ఇదే త్రైమాసికానికి 2455 కోట్లుగా ఉంది. పలు ఏజెన్సీల అంచనాలను కూడా మంచి ఫలితాలు ప్రకటించింది. ముగిసిన త్రైమాసికానికి 1.3శాతం పెరిగి మొత్తం 15,670 కోట్లు రెవిన్యూ సాధించింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ ఆదాయం 15,470 కోట్లుగా ఉంది. 3.7శాతం పెరిగింది. ఐటీ సర్వీసుల ద్వారా కంపెనీ ఆదాయం 2071 మిలియన్ డాలర్లుగా చూపించారు. 

 

కంపెనీ మంచి పనితీరుతో ఆకట్టుకుంటుంది. గత ఏడాది కంపెనీ మొత్తం 14వేల మందిని కొత్తగా హైర్ చేసుకుంది. ఇందులో 2900 మంది ఫ్రెషర్స్ ఉన్నారు.