పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్‌కి చిక్కులు తప్పవా..? కార్లైల్ డీల్‌పై సెబీ స్కానింగ్! డీల్‌ని వ్యతిరేకించాలంటూ షేర్ హోల్డర్లకు SES సంస్థ పిలుపు

2021-06-11 20:46:24 By Anveshi

img

ఈ నెలలో మంచి దూకుడు ప్రదర్శించిన పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ జోరుకు కాస్త కళ్లెం పడేలా కన్పిస్తోంది. ఎందుకంటే అమెరికన్ ప్రవేట్ ఈక్విటీ ఫర్మ్ కార్లైల్ గ్రూప్ ఈ సంస్థలో రూ.4వేల కోట్లు పెట్టుబడి పెట్టడంపై సెబీ ఫోకస్ పెట్టింది. కార్లైల్ గ్రూప్ పెట్టుబడిపై స్టేక్ హోల్డర్స్ ఎంపవర్‌మెంట్ సర్వీసెస్ అనే సంస్థ ఆరోపణలతో సెబీకి కంప్లైంట్ చేయడంతో సెబీ మొత్తం వ్యవహారాన్ని స్కాన్ చేస్తోంది. అలానే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా ఈ మ్యాటర్‌లో ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది

 

ఎస్ఈఎస్ అనే ఈ కంపెనీ ఆరోపణ ప్రకారం కంపెనీ బుక్ వేల్యూ కంటే చాలా తక్కువకే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి సంబంధించిన హౌసింగ్ పైనాన్స్ విభాగంలో వాటాలు విక్రయించారు. ఈ డీల్ ద్వారా తనకి హౌసింగ్ పైనాన్స్ విభాగంపై ఉన్న నియంత్రణను పూర్తిగా కార్లైల్ గ్రూప్‌కి పిఎన్‌బి బదిలీ చేస్తుందనేది మరో ఆరోపణ. తక్కువ ధరకే ఇలా నియంత్రణాధికారాన్ని కార్లైల్ గ్రూప్‌కి ఎలా కట్టబెడతారంటూ స్టేక్‌హోల్డర్స్ ఎంపవర్‌మెంట్ సర్వీసెస్ కంపెనీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని సెబీకి కంప్లైంట్ చేసింది
అంతేకాదు SES సంస్థ తొందర్లో జరగబోయే పిఎన్‌బి షేర్ హోల్డర్ల మీటింగ్‌లో ఈ డీల్‌ని వ్యతిరేకించాల్సిందిగా రిటైల్, మైనార్టీ షేర్ హోల్డర్లను కౌన్సిలింగ్ చేస్తోంది. వోటింగ్‌లో  కంపెనీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపు ఇచ్చింది

 

ఈ పరిణామాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో PNB హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ షేర్లు 4శాతం నష్టపోయి రూ.816.90కి పతనం అయ్యాయ్ 


మరి PNB  వాదనేంటి?

 

కంపెనీస్ యాక్ట్ 2013, సెబీ చట్టాల ప్రకారమే తాము నడుచుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. బిఎస్ఈ,ఎన్ఎస్ఈ నుంచి తమకి ఈ విషయమై ఎంక్వైరీ వచ్చిందని, దానికి తగిన విధంగా సమాధానం ఇస్తామంటూ కంపెనీ పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ అధికార ప్రతినిధి చెప్పారు.

 

పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ బుక్ వేల్యూ రూ.520 ఉండగా రూ.384.6 ధర అనేది ఫెయిర్ వేల్యూగా చెప్తుండగా, SES సంస్థ వాదన మాత్రం వేరుగా ఉంది. చూద్దాం ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో..!


Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending