ఓరయో.. ఓరియంట్ సిమెంట్ చూడండయో..! 10% పెరిగిన షేరు !

2021-05-18 11:25:59 By Anveshi

img

ఆర్థిక ఫలితాలు అదరగొట్టడంతో ఓరియంట్ సిమెంట్ స్టాక్ బిఎస్ఈ,ఎన్‌ఎస్ఈలో పరుగులు పెట్టింది. నిన్నటి ముగింపు ధరతో పోల్చితే ఏకంగా పదిశాతం వరకూ దౌడ్ తీసి రూ.133.70కి ఎగసింది. ఆనక కాస్త అలుపు తీర్చుకుంటోంది. దీనికంతా కారణం, క్యు4లో  రూ.99.87కోట్ల నికరలాభం ఆర్జించడమే. 2020 గత ఏడాది ఇదే సమయంలో ఈ లాభం రూ.44.06కోట్లు మాత్రమే. అంటే లాభం రెట్టింపు అయిందన్నమాట..అలానే మొత్తం రెవెన్యూ కూడా గత ఏడాది క్యు4లో నమోదైన రూ.654.52 కోట్ల  నుంచి రూ.831.61కోట్లకి ఎగసింది


కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో కొన్నాళ్లు సిమెంట్ యూనిట్లు మూతబడినా ఓరియంట్ సిమెంట్ దాన్ని అధిగమించి మరీ ఈ స్థాయి లాభాలు ఆర్జించడం గమనించాలి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 17.1% గ్రోత్‌తో 1.85 మిలియన్ టన్నుల అమ్మకాలు సాధించినట్లు కంపెనీ బోర్డ్ ప్రకటించింది.


ప్రస్తుతం ఓరియంట్ సిమెంట్ షేర్లు 3.58శాతం పెరిగి రూ.126 వద్ద ట్రేడ్ అయ్యాయ్

 


ORIENT CEMENT SOFT BANK GROUP BIRLA A1 TELUGU PROFIT TRADE

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending