నైకా ర్యాలీ ఇండస్ట్రీ హిట్..! ఫ్రెష్ 52 వీక్స్ హై ప్రైస్ టచ్ చేసిన స్టాక్

2021-11-25 16:59:00 By Anveshi

img

మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చిన ఎప్ఎస్ఎన్ ఈ కామర్స్ సంస్థ షేర్లు, లిస్టింగ్ రోజున కేక పెట్టించిన సంగతి గుర్తుండే ఉంటుంది.లిస్టింగ్ రోజున రూ.2వేల ధరపైనే ట్రేడింగ్ ప్రారంభించగా, ఆ రోజు నుంచి ఎక్కడా కూడా ఆ రేటు కిందకు దిగలేదు. 

 

తాజాగా ఇవాళ్టి మార్కెట్లలో గత గరిష్టాన్ని అధిగమించి 8శాతంకిపైగా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో రూ.2431.15 వద్ద కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ కేపిటలైజేషన్ లక్షా14వేల కోట్లకు ఎగసింది. వాల్యూమ్స్ పరంగా కూడా నైకా కౌంటర్ ప్రతి రోజూ పాతికలక్షల షేర్ల లావాదేవీలు నిర్వహిస్తూ..మంచి స్పీడ్ ప్రదర్శిస్తోంది

 

క్లోజింగ్‌లో నైకా షేర్లు రూ.2424 వద్ద ముగిశాయ్


nykaa closing price 52 weeks high

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending