ఈ విషయంలో TCS మళ్లీ రికార్డు సృష్టించింది

2021-01-26 08:34:39 By Y Kalyani

img

TCS మళ్లీ రికార్డు స్రుష్టించింది
దేశంలో అతిపెద్ద కంపెనీ
ప్రపంచంలోనే టాప్ ఐటీ దిగ్గజంగా రికార్డు

ముంబైకు చెందిన ఐటీ కంపెనీ  Tata Consultancy Services మరోసారి చరిత్ర స్రుష్టించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా మరోసారి నిలిచింది. మార్కెట్ కేపటిలైజేషన్ లో జనవరి 25న అసెంచుర్ కంపెనీని దాటేసింది. అసెంచుర్ కంపెనీ వాల్యూ 168.8 బిలియన్ డాలర్లు అయితే.. TCS కంపెనీ వాల్యూ 169.21 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది అక్టోబర్ లో కూడా కంపెనీ అసెంచుర్ కంపెనీని దాటేసింది. న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ లో లిస్ట్ అయిన అసెంచుర్ ఐటీ సేవల్లో అగ్రస్థానంలో ఉంటుంది.  ఇప్పుడు మరోసారి మన TCS దాటేసింది. SAP,IBM కంపెనీలకు అందనంత ఎత్తులో ఉంది. 
ప్రపంచంలో టాప్ ఐటీ కంపెనీగా నిలవడమే కాదు.. దేశీయంగా మోస్ట్ వాల్యూ కంపెనీగా అవతరించింది. నెంబర్ వన్ స్థానంలో ఉన్న   Reliance Industries Ltd ను దాటేసింది. మార్చి2020లో ఒకసారి దాటేసింది. ప్రజంట్ అంటే జనవరి 25న రిలయన్స్ కంపెనీ మార్కెట్ వాల్యూ 168.47 బిలియన్ డాలర్లుగా ఉంది. 

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending