Nత లాభం..! అదరగొట్టిన ఎన్‌టిపిసి ఆర్థిక ఫలితాలు! Q4లో 280% జంప్ చేసిన ప్రాఫిట్! షేరులో ఏదైనా కదలిక వస్తుందా మరి..?

2021-06-19 20:17:02 By Anveshi

img

( ఈ రోజు ఉదయం మన సైట్‌కి హోస్ట్ సర్వీస్ అందిస్తోన్న ప్రొవైడర్‌కి తలెత్తిన సమస్యతో హోమ్‌పేజ్ వ్యూయర్స్‌కి అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు తిరిగి యధావిధిగా పని చేస్తుంది. గమనించగలరు)

 

క్యు4లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. 2020 క్యు4తో పోల్చితే, దాదాపు మూడింతలై రూ.4649కోట్లకి ఎగసింది. 2020లో ఈ లాభం రూ.1629కోట్ల రెవెన్యూ గడించగా, భారీగా ఆదాయం  సంపాదించడంతో లాభాలు ఈ స్థాయికి చేరినట్లు కంపెనీ ప్రకటించింది. రివ్యూలో ఉన్న అంచనాల ప్రకారం 2021 క్యు4లో  ఎన్‌టిపిసి రూ.31330.25కోట్ల ఆదాయం నుంచి రూ.31687.24కు పెరిగింది. 

 

మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఎన్‌టిపిసి రూ.14969.40కోట్ల లాభం గడించగా, అంతకి ముందటి ఏడాది ఇది  రూ.11191.98కోట్లు మాత్రమే. దీంతో పాటే కంపెనీ బోర్డు సమావేశంలో వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.3.15 ఫైనల్  డివిడెండ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్‌టిపిసి ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండ్‌గా రూ.3ను  వాటాదారులకు ఇచ్చింది. 

 

అలానే గడచిన ఆర్థిక సంవత్సరంలో 3 మిలియన్ టన్నుల నుంచి 1.08 మిలియన్ టన్నులకు మాత్రమే బొగ్గు దిగుమతి చేసుకోగలిగిన ఎన్‌టిపిసి, కంపెనీ అప్పుల పరిమితిని రూ.2లక్షలకోట్ల నుంచి 2.25లక్షల కోట్ల రూపాయలకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. 

 

ఎన్‌టిపిసి షేర్లు గత ట్రేడింగ్ సెషన్‌లో ( శుక్రవారం, జూన్ 18) రూ.113.55 వద్ద ముగిశాయ్


NTPC RALLY PROFIT THREE FOLD JUMP NET REVENUE BORROW LIMIT TELUGU