ఇకపై డిజిటల్ చెల్లింపులకు ఇంటర్నెట్‌తో పని లేదు.. 

2021-10-13 09:47:51 By VANI

img

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి. కూరగాయల నుంచి వేలల్లో చెల్లింపులకు మనం యూపీఐని బాగా వాడేస్తున్నాం. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలను ఎడా పెడా వాడేస్తున్నాం. మొబైల్ ఉంటే చాలు.. అన్ని పనులు జరిగిపోతాయ్. అయితే నెట్ లేకపోతే మాత్రం చెల్లిపులు సాధ్యపడదు. కనీసం డెబిట్ కార్డు స్వైప్ చేయాలన్నా ఇంటర్నెట్ కావాల్సిందే. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ నెట్ లేకుంటే చెల్లింపులు చేయడం సాధ్యకపోవడం పట్ల విమర్శల పాలవుతోంది.

 

దీనికి పరిష్కారంగా అసలు ఇంటర్నెట్‌ లేకున్నా, ఆఫ్‌లైన్‌ ద్వారానే డిజిటల్‌ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆవిష్కరించి, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సంతృప్తికర ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ యోచిస్తోంది. ఇక నెట్ లేకుండా ఇదెలా సాధ్యమంటే.. ఈ ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం బ్యాంకులు లేదా ఫిన్‌టెక్‌ సంస్థలు డెబిట్ కార్డు లాంటి ఒక ప్రత్యేక కార్డు లేదా టోకెన్‌ ఇస్తాయి. 

 

నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు ఈ కార్డును వాడుకోవచ్చు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రం ద్వారా ఆ చెల్లింపును చేయాల్సి ఉంటుంది. ఈ పీఓఎస్ యంత్రానికి సైతం నెట్‌తో పని లేదు. వాయిస్‌ బేస్డ్‌ చెల్లింపులనూ ఈ పద్ధతిలో చేసే వీలుంటుంది. ఐవీఆర్‌ ద్వారా సూచనలు ఇచ్చి, చెల్లింపులను పూర్తి చేయొచ్చు. అయితే దాదాపు పదేళ్ల కిందే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశ పెట్టింది. 


Phone Pay  Google Pay  Paytm  

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending