తెలంగాణకు మరో భారీ పెట్టుబడి... లైన్ క్లియర్

2021-07-28 08:58:16 By Y Kalyani

img

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి... లైన్ క్లియర్

వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న తెలంగాణకు మరో కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. 1,200 కోట్లుతో సంస్థ ఏర్పాటు చేయడానికి  ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకరించింది. సౌర విద్యుత్ ఉత్పత్తి పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌.. హైదరాబాద్‌లో నెలకొల్పిన కొత్త ప్లాంటును ఈ నెల 29న ప్రారంభిస్తోంది. రూ.483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ను గురువారం  కేటీఆర్ ప్రారంభిస్తారు. అయితే దీంతో పాటు విస్తరణ ప్రాజెక్టు కూడా హైదరాబాద్ లోనే ఉంటుందని.. ఇందుకోసం మరో 1200 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది సంస్థ. 
త్వరలో ప్రారంభం కానున్న యూనిట్ లో 750 మెగావాట్ల సోలార్‌ సెల్స్‌, 750 మెగావాట్ల సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంటులో ఎంసీసీఈ టెక్చర్డ్‌ మల్టీ-క్రిస్టల్లీన్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌, మోనో పీఈఆర్‌సీ సెల్స్‌, మాడ్యూల్స్‌, పాలీక్రిస్టల్లీన్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ ఉత్పత్తవుతాయి. రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో వచ్చే రెండేండ్లలో ఉత్పాదక సామర్థ్యాన్ని 3 గిగావాట్లకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లోనే రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్‌ సామర్థ్యాన్ని పెంచుతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 500 కోట్లు పెట్టుబడి పెడుతామని తెలిపింది. మొత్తంమీద వచ్చే రెండేండ్లలో రూ.1,000-1,200 కోట్లు వరకు తెలంగాణలో ఇన్వెస్ట్‌ చేయనున్నారు. 

కంపెనీ 1995లో స్థాపించారు. సురేందర్ పాల్ సింగ్ వ్యవస్థాపకుడు. వెయ్యి మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ.. సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తిలో ఉంది. రూఫ్ టాప్, గ్రౌండ్ మౌంటెడ్, వాటర్ పంప్స్ విభాగంలో ఉత్పత్తి చేస్తోంది. హైదరాబాద్లో ప్రస్తుతం లక్ష చదరపు అడుగుల స్థలంలో యూనిట్ ఉంది. భారత్ లోని వివిధ సంస్ధలతో పాటు.. ఏసియా, యూరోప్, ఆఫ్రికాలోని 30దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ.850 కోట్ల టర్నొవర్ సాధించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం రూ.1500 కోట్లు సాధిస్తామంటోంది. 


telangana investiments news premier solar

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending