ఎందుకో ఏమో.. నాట్కో ఫార్మా లాభాలు తగ్గాయి

2021-06-17 22:37:52 By Y Kalyani

img

ఎందుకో ఏమో.. నాట్కో ఫార్మా లాభాలు తగ్గాయి

హైదరాబాదుకు చెందిన నాట్కో ఫార్మా కంపెనీ లాభాలు తగ్గాయి. ఆర్ధిక సంవత్సరం 2021 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ 43శాతం పడిపోయింది. కేవలం రూ.53 కోట్లు మాత్రమే చూపించింది. గత ఏడాది 2019-20లో ఇదే కాలానికి కంపెనీ నికరంగా రూ.93 కోట్ల లాభాన్ని చూపించింది. ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. గత ఏడాది 477 కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఇది కేవలం రూ.360 కోట్లకు పరిమితం అయింది. 

2020-21 ఏడాదిలో... 
కంపెనీ నికరంగా రూ.442 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇది 458 కోట్లుగా ఉంది. టోటల్ ఇన్ కం కూడా రూ.2156 కోట్లుగా కాగా.. 2019-20లో ఇది 2022 కోట్లు. అయితే పెండిమిక్ కారణంగా వ్యాపారంపై ప్రభావం తీవ్రంగా పడినా కూడా మెరుగైన ఫలితాలు సాధించినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో స్ట్రాంగ్ ఫలితాలు ఆశిస్తున్నట్టు కంపెనీల తెలిపింది. 


nautco drug company net profit shares stocks bse