ముఖేష్ అంబానీకే టోకరా వేసిన కేటుగాళ్లు

2021-01-22 23:09:13 By Y Kalyani

img

ముఖేష్ అంబానీకే టోకరా వేసిన కేటుగాళ్లు

ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీనే మోసం చేశాడు కేటుగాడు. కల్పేష్ దఫ్తరీ  అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. కల్పేష్ దఫ్తారి, కొంతమందితో కలిసి ప్రత్యేక వ్యవసాయ, గ్రామ పరిశ్రమ పథకం విశేష్ కృషీ, గ్రామ ఉద్యోగ్ యోజన స్కీమ్‌ పేరుతో లైసెన్సులను తీసుకున్నాడు. ఈ లైసెన్సులను కల్ఫేష్‌ హిందుస్తాన్ కాంటినెంటల్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట తీసుకొచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించాడు. ఈడీ దర్యాప్తులో 13 లైసెన్సులను 6.8 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు గుర్తించారు. ఈ స్కామ్‌లో కల్పేశ్ దఫ్తరీతో పాటు అహ్మద్, పియూష్ వీరంగామ, విజయ్ గాడియా మరి కొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని మోసం చేసిన కల్పేష్ దఫ్తారి యాజమాన్యంలోని సంకల్ప్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 4.87 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. వీటిలో ముంబైలో కమర్శియల్ కాంప్లెక్స్ తో పాటు.. రాజ్‌కోట్‌లో నాలుగు భవనాలను సీజ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు జరుగుతోంది. 

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending