మజా ఆగయా..! మాజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్‌లో ర్యాలీ..! పాలపొంగులా పెరిగిన షేరు

2021-06-11 13:08:56 By Anveshi

img

నికరలాభం అండతో మార్కెట్లలో మాజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ కంపెనీ ట్రేడర్లకు ఆనందం తెచ్చిపెట్టింది.క్యు4లో నెటన్ ప్రాఫిట్ ఆరింతలు అయి రూ.230.40కోట్లకి చేరింది. దీంతో స్టాక్ కూడా ఇంట్రాడేలో 4శాతానికిపైగా పెరిగి రూ.283.95 ధరని చేరాయి

 

మాజగాన్ డాక్‌ షిప్‌బిల్డర్స్ సంస్థ గురువారం ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికరలాభం దాదాపు ఆరింతలు పెరిగినట్లు చెప్పింది. 2020 మార్చి క్వార్టర్‌లో రూ.41.55కోట్ల నికరలాభం ఉండగా, ఇప్పుడు 2021 మార్చి క్వార్టర్‌లో రూ.230.40కోట్లకి చేరడం విశేషం. లాభం ఇంతగా పెరగడంతో కంపెనీ షేర్లపై ట్రేడర్ల ఫోకస్ పడింది. ఆదాయంలోనూ 6శాతం వృద్ధి నమోదు చేసిన మాజగాన్ డాక్‌షిప్ బిల్డర్స్ సంస్థ క్యు4లో మొత్తం ఆదాయం రూ.1378కోట్లు ఆర్జించింది

 

ప్రస్తుతం షేర్ల లాభాలన్నీ ఆవిరి కాగా, 0.60శాతం లాభంతో రూ.275.30 వద్ద ట్రేడ్ అయ్యాయ్


mazagon dockship yard builders shares rally manifold jump revenue q4 results profit

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending