మారుతి సుజుకీకి సరికొత్త రికార్డ్‌తో బూస్ట్ ఇచ్చిన స్విఫ్ట్.. 

2021-09-15 10:25:18 By VANI

img

వాహనాల ధరలను పెంచుతూ మార్కెట్‌లో కాస్త వెనుకబడిపోయిన దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీకి స్విఫ్ట్ కారు ఫుల్ బూస్ట్ ఇచ్చింది. మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ కారు కొత్త రికార్డు సృష్టించింది. స్విప్ట్ కార్లు గడిచిన 16 ఏళ్లలో మొత్తం 25 లక్షల పైచిలుకు అమ్మకం జరిగింది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో స్విఫ్ట్ దుమ్మురేపింది. మే 25, 2005న భారత మార్కెట్‌లో స్విఫ్ట్ లాంచ్ అయ్యింది. మైలేజ్, రూపు, సామర్థ్యం పరంగా అద్భుతంగా ఉండటంతో వినియోగదారుల మనసు గెలుచుకుంది.

 

ఈ విజయం బ్రాండ్‌ స్విఫ్ట్‌ పట్ల వినియోగదారులు, విమర్శకుల ప్రేమకు నిదర్శనమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 52 శాతం మంది వినియోగదార్లతో.. యువ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా స్విఫ్ట్‌ నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకుంటోందని శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం స్విఫ్ట్ అనేది ఒక బ్రాండ్. మారుతి మూడు తరాల పాటు రెండు మిలియన్ ప్లస్ కార్లను విక్రయించింది. 

 

నిజానికి మారుతి సుజుకీ కారుకి స్విఫ్ట్ అనే నామకరణం చేయడానికి ముందు చాలా ఆసక్తికర కథ నడిచిందట. కొందరు జెన్ అనే పేరును సూచించారట. ఈ నేమ్ ప్లేట్ ఇప్పటికే భారతదేశంలో మంచి సక్సెస్ సాధించింది. అంతేకాకుండా బాగా తెలిసిన పేరు కూడా కావడంతో పాటు కారు జెమ్‌లా ఉంది కాబట్టి ఈ కారుకు జెన్ అనే పేరు సరిగ్గా సరిపోతుందనేది వారి వాదన.  అయితే చాలా మంది జపనీయులు ఒప్పుకోలేదు. జపాన్‌లో స్విఫ్ట్ గొప్ప బ్రాండ్ నేమ్ అని చెప్పారు. డిస్కషన్లు, డిబేట్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఇక చివరకు ఓటింగ్ పెట్టాలనుకున్నారు. అయితే జెన్‌కు ఓటు చేసిన వారిలో ఇద్దరే ఉండటంతో ఫైనల్‌గా స్విఫ్ట్ పేరు ఖరారైంది. 


Maruti Suzuki India  Maruti Swift  Sasank Srivastava

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending