రిజల్ట్స్ పై అంచనాలతో మారికో ఇండస్ట్రీస్‌లో జోరు! ఇంట్రాడేలో 5% స్వింగ్

2021-04-13 13:01:39 By Anveshi

img

మారికో ఇండస్ట్రీస్ కౌంటర్‌లో ఇవాళ స్పీడ్ చోటు చేసుకుంది.గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన ఈ స్టాక్  ట్రేడింగ్ తిరిగి 3శాతం పెరగడంతో ఇంట్రాడేలో దాదాపు 5శాతం స్వింగ్ నమోదు అయింది మారికో ప్రస్తుతం 2.95శాతం పెరిగి రూ.419.40 వద్ద ట్రేడ్ అయింది.ఎఫ్ఐఐలకు 24.16శాతం వాటా కలిగిన సంస్థ కావడంతో ఈ స్టాక్ చాలామందికి హాట్ ఫేవరెట్ అయింది కూడా

క్యు4లో తక్కువ మార్జిన్లతో అయినా డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు అవుతుందని అంచనా వేస్తోంది కంపెనీ. గత ఏడాది కరోనా దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జొమేటో, స్విగీతో టై అప్ పెట్టుకున్న మారికో ఇండస్ట్రీస్ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు

1 బిలియన్ డాలర్ రెవెన్యూ కలిగిన మారికో ఇండస్ట్రీస్ దాదాపు 15రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది. హెల్త్, బ్యూటీ, కాస్మెటిక్, ఎఫ్ఎంసిజి రంగంలో మారికో ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. గంజి పొడి నుంచి బాడీ లోషన్ వరకూ, వంట నూనె సఫోలా నుంచి కొబ్బరి నూనె ప్యారాచూట్ వరకూ మారికో ఉత్పత్తులు ఇంటింటా వినియోగమవుతుంటాయ్


marico shares industries double digit growth dollar revenue profit trade telugu market

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending