-->

రెండేళ్ళ గరిష్టానికి ఎంఅండ్‌ఎం

2021-01-13 12:25:34

img

కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.1ట్రిలియన్‌ మార్క్‌ దాటడంతో ఇవాళ ఎంఅండ్‌ఎం రెండేళ్ళ గరిష్టానికి చేరింది. ఇంట్రాడేలో షేర్‌ 5శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.817కు చేరింది. ఇది రెండేళ్ళ గరిష్ట స్థాయి కావడం విశేషం. ప్రస్తుతం నాలుగున్నర శాతం లాభంతో రూ.816.15 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ ఇప్పటివరకు 71.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,01,910 కోట్లకు చేరింది.


ప్రస్తుతం అక్టోబర్‌ 2018 గరిష్ట స్థాయి వద్ద షేర్‌ కొనసాగుతోంది. 2018 ఆగస్ట్‌ 30న ఎంఅండ్‌ఎం రికార్డు స్థాయి గరిష్టం రూ.992ను నమోదు చేసింది. కొత్త ఏడాదిలో ఇప్పటివరకు ఈ స్టాక్‌ 13శాతం పైగా లాభపడింది. దీంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1 ట్రిలియన్‌ మార్కును అధిగమించింది.