డ్రాగన్‌కు మరో ఝలక్‌ ఇవ్వనున్న భారత్‌? విషయం ఏమిటంటే..?

2021-09-23 10:29:05 By Marepally Krishna

img

- డ్రాగన్‌కు మరో ఝలక్‌ ఇవ్వనున్న భారత్‌?
- ఎల్‌ఐసీ ఐపీఓలో చైనా పెట్టుబడులకే బ్రేక్‌ పడే ఛాన్స్‌

భద్రతాపరమైన కారణాలు చూపుతూ చైనా యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌ఐసీ ఐపీవో విషయంలోనూ డ్రాగన్‌కు ఝలక్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే ఎల్‌ఐసీ ఐపీవోలో చైనా పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. అదే సమయంలో ఇతర విదేశీ మదుపర్లు ఐపీవో పాల్గొనేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం చైనా పెట్టుబడులను పరిమితం చేసేందుకు భారత్‌ కొన్ని చర్యలను చేపట్టింది. పలు యాప్స్‌పైనా నిషేధం విధించింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపైనా నిఘా పెంచింది. ఎల్‌ఐసీ ఐపీవోలో సైతం చైనా పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిసింది.  


LIC IPO Launch Date LIC IPO gets cabinet approval, may be launched in March  2022, investor will get great earning opportunity | LIC IPO को कैबिनेट की  मंजूरी! इस दिन होगा सबसेప్రస్తుతం ఎల్‌ఐసీ చట్టం ప్రకారం.. విదేశీపెట్టుబడులకు అనుమతి లేదు. ప్రైవేట్‌ బీమా సంస్థల్లో 74శాతం, ప్రభుత్వ రంగంలో 20శాతం వరకు వాటాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఎల్‌ఐసీలో మాత్రం ఎఫ్‌ఐఐల పెట్టుబడులకు అనుమతి లేదు. కానీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులూ పాల్గొనేలా చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఎల్‌ఐసీలోకి ఎఫ్‌డీఐలను అనుమతించినపక్షంలో... దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా రూపుదిద్దుకునే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూలో అతిపెద్ద విదేశీ పెన్షన్‌ ఫండ్‌లు, బీమా సంస్థలు పాల్గొనే అవకాశముంటుంది. 


అదే సమయంలో చైనాను అడ్డుకోవడానికి ప్రస్తుత చట్టంలో ఏమైనా మార్పులు చేస్తుందా? లేదంటే కొత్త చట్టం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే, పెట్టుబడుల నిరోధానికి కేంద్రం చర్యలు తీసుకున్నా.. సెకండరీ మార్కెట్‌ ద్వారా వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం సాధ్యపడదని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించి సుమారు ₹90 వేల కోట్ల మేర రాబట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది.

LIC IPO: Centre plans to raise up to Rs 25,000 cr from over 24 anchor  investors - BusinessToday


IPO LIC CHINA INDIA

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending