కోటక్ బ్యాంక్ లాభం రూ.1682.4కోట్లు..! వేధిస్తున్న ప్రొవిజన్ల చింత

2021-05-03 22:12:22 By Anveshi

img

Q4లో రూ.1682.4కోట్ల నికరలాభం
నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్ 8శాతం వృద్ధి
నికర వడ్డీ ఆదాయం రూ.3843కోట్లు

ప్రవేట్ సెక్టార్ లెజెండ్రీ బ్యాంక్ కొటక్ బ్యాంక్ క్యు4 ఆర్థిక ఫలితాలు మరీ అబ్బురపరచకపోయినా, నిరాశాజనకంగా మాత్రం లేవు. నికరలాభంలో 33శాతం వృద్ధి సాధించినా, ప్రొవిజన్లు వెంటాడినట్లు అర్ధమవుతోంది. క్యు4 నికరలాభం  రూ.1682.4కోట్లుగా నమోదు అయింది. వడ్డీ ఆదాయం 8శాతం  వృద్ధితో 3842.81కోట్లకి పెరిగింది. ఈ నెట్ ఇంట్రస్ట్ మార్జిన్లే  బ్యాంక్ లాభదాయకతకు భారీగా దోహదపడినట్లు అర్ధమవుతోంది.

ఎక్స్‌పర్ట్స్ కోటక్ బ్యాంక్ కనీసం 1800 కోట్ల లాభం ఆర్జిస్తుందని అంచనా వేయగా, అది మిస్ కావడం గమనార్హం. క్యు4 కాలంలో  బ్యాంక్ డిపాజిట్ల విలువ 6.6శాతం వృద్ధితో రూ.2.8లక్షల కోట్లుగా నమోదు కావడం విశేషం. అయితే ఇది కూడా అంచనాలను అందుకోలేకపోయిందని  కొందరి అభిప్రాయం. నెట్ ప్రొవిజన్లు 12.6శాతం పెరిగి  రూ.1179.41కోట్లకి చేరాయ్. కోవిడ్ 19 ప్రొవిజన్లు, స్పెసిఫిక్ ప్రొవిజన్లు, స్టాండర్ట్ అన్నీ కలిపి మొత్తం 7,021 కోట్లకి  చేరాయని కంపెనీ ప్రకటించింది. ఇవే మొత్తం ఎన్‌పిఏలలో 95శాతానికి సమానం.

మొత్తంగా 2021లో కొటక్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్  రూ.2589కోట్లు ఆర్జించినట్లు ప్రకటించింది


kotak bank mahindra uday nse bse telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending