బిలియన్ డాలర్ భామ ! ఫోర్బ్స్‌ లిస్ట్‌లోకి లేటైనా లేటెస్ట్‌ ఎంట్రీ ఇచ్చిన లేడీ

2021-04-08 22:04:28 By Anveshi

img

మన టివిషోలు..సినిమాలకే పరిమితం అయిన వారికి ఈ హాట్ లేడీ పెద్దగా పరిచయం లేదు. ఐతే హాలీవుడ్ షోలు, ఫ్యాషన్ బ్రాండ్లు ఫాలో అయ్యేవారికి కిమ్ కర్దాషియన్ బాగా తెలుసు. రియాల్టీ షో యాంకర్, కాస్మెటిక్స్ ఫ్యాషన్ బ్రాండ్, షేప్‌వేర్  లింగరీస్‌కి ఓనర్‌గా కిమ్ కర్దాషియన్ అమెరికాలో బాగా పాపులర్. ఇప్పుడీ భామ పరిచయ వ్యాక్యాలు ఎందుకంటే, రెండు రోజుల క్రితం ఫోర్బ్స్ మేగజైన్ అఫిషియల్‌గా కిమ్‌ను బిలియనీర్‌గా తన వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్‌లో చేర్చింది. గత సంవత్సరం అక్టోబర్‌లో కిమ్ కర్దాషియన్ ఆస్తులు 780మిలియన్ డాలర్లు కాగా, రెండురోజుల క్రితం 1 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది

కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్ అనే రియాల్టీ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించిన ఈమె వయసు 40ఏళ్లు . తల్లిదండ్రులకు  మొత్తం నలుగురు సంతానం కాగా, వారిలో కిమ్ రెండో కూతురు కాగా, ఆమె అక్క కౌట్నీ, చెల్లెలు క్లో కర్దాషియన్, తమ్ముడు రాబ్ ఉన్నారు..కర్దాషియన్ అనేది ఓ ఫ్యామిలీ, మనకి ఎలాగైతే వంశంగా చెప్పుకుంటుంటామో అలాగే అక్కడి ఓ తెగ  అనుకోండి. అలాంటి కర్దాషియన్ సిస్టర్స్‌లో కిమ్ కర్దాషియన్ ఆ వంశం పేరుని బాగానే నిలబెట్టింది. KKW అనే ఫ్యాషన్ బ్యూటీ  ఫ్రాగ్రెన్స్ ప్రొడక్ట్స్‌‍ని 2017లో లాంఛ్ చేసిందామె. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో 213 మిలియన్లమంది ఫాలోయర్లున్నారీమెకి. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా..! రెండేళ్ల క్రితమే స్కిమ్స్ (skims)అనే షేప్‌వేర్ ఫ్యాషన్ లింగరీస్‌ని లాంఛ్ చేయగా బాగా పాపులర్ అవుతున్నాయవి..!

 

ఫోర్బ్స్ లిస్ట్‌లో ఆమె పేరు అధికారికంగా చేర్చారని తెలిసిన సమయంలో ఈ బ్యూటీ తన స్కిమ్స్ పాపప్ షాప్‌ను లాస్  ఏంజెల్స్‌లో ఓపెన్ చేస్తూ బిజీగా ఉంది. అప్పుడే ఈ విషయం చెప్పగా..బ్లెస్డ్ గా ఫీలవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంకా కిమ్ కర్దాషియన్ గురించి చెప్పాలంటే, ఈ మద్యనే క్యానే వెస్ట్ అనే తన మూడో మొగుడికి విడాకులు ఇచ్చింది. వీళ్లిద్దరికీ నలుగురు  పిల్లలు ఉన్నారు. ఇతగాడు ఆ మధ్య వీలు కాదని తెలిసినా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడతానంటూ హడావుడి చేశాడు కూడా..! తన పేరిటే ప్రత్యేకంగా ఓ స్కిన్ ప్రొడక్ట్‌ని కూడా లాంఛ్ చేసే ఆలోచనలో ఉన్న కిమ్ కర్దాషియన్ సోషలైట్,  మీడియా  పర్సన్, బిజినెస్ ఉమెన్ మాత్రమే కాకుండా..ఇంకా లాయర్ కూడా అవ్వాలని అనుకుంటోందట.భర్త నుంచి విడాకులు పొందడంతో వచ్చే భరణాన్ని కూడా పెట్టుబడిగా పెట్టి కొత్త వెంచర్స్ స్టార్ట్ చేద్దామనేది ఈమె వ్యూహంగా  చెప్తున్నారు..అమెరికాలో అంతే మరి..!

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending