ట్రేడర్ల పాలిట కల్పతరు..! పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ ! ఆర్బిట్రేషన్ కలిసి రావడంతో దంచి కొట్టిన షేర్లు

2021-09-23 12:25:26 By Anveshi

img

రవాండా ఎనర్జీ గ్రూప్‌తో వివాదం విషయంలో రూ.236కోట్ల మేర ఆర్బిట్రేషన్ దక్కించుకోవడంతో కల్పతరు పవర్ షేర్లు పండగ చేశాయ్. ఇంట్రాడేలో 4శాతానికిపైగా పెరిగి రూ.414 ధరకి ఎగసాయ్


220కెవి పవర్ ట్రాన్స్‌మిషన్ నెట్వర్క్ విషయంలో సెంట్రల్ ఆఫ్రికా దేశమైన కాంగో,రవాండాతో కల్పతరు ప్రాజెక్ట్‌కి వివాదం తలెత్తింది. దీంతో ఆర్బిట్రేషన్ సాగుతున్న ఈ కేసులో తీర్పు సంస్థకి అనుకూలంగా వచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ ప్రకటించింది.2013లో ఈ ఒప్పందం ఖరారు కాగా అక్టోబర్ 2014 నుంచి పనులు కూడా ప్రారంభం అయ్యాయ్. 

 

ఫిబ్రవరి 2016లో కల్పతరు ట్రాన్స్ మిషన్ పవర్ టారిఫ్‌కి సంబంధించి సవరణ కోరుతూ 24 మిలియన్ డాలర్ల మేర రవాండా ఎనర్జీ సంస్థపై క్లెయిమ్  వేసింది. ఐతే పవర్ ప్రాజెక్టు మొత్తం పూర్తైన తర్వాత ఈ సవరణ వర్తిస్తుందంటూ రవాండా చెప్పింది. అందుకు తగినట్లుగానే కంపెనీ తన పని 2017లో పూర్తి చేసి, ఈ సవరణ బిల్లుపై కేసు వేయగా, అదలా నడుస్తూ వచ్చింది

 

ప్రస్తుతం కల్పతరు పవర్ షేర్లు 404.50 వద్ద ట్రేడ్ అయ్యాయ్
 


congo rwanda arbitration award power kalpataru rally

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending