జోరుమీదున్న జుబిలెంట్‌ ఫుడ్స్‌

2021-07-22 10:35:36 By Marepally Krishna

img

బ్రోకరేజీ సంస్థలు బుల్లిష్‌ కాల్‌ ఇవ్వడంతో ఇవాళ నోయిడాకు చెందిన ఫుడ్‌ సర్వీసెస్‌ కంపెనీ జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ ఇంట్రాడేలో అప్పర్‌ లిమిట్‌(3,524.15)కు సమీపంలో వచ్చిన ఈ స్టాక్‌ దాదాపు 19శాతం లాభపడి 3513కు చేరింది. హైయర్‌ లెవల్స్‌లో అనూహ్యంగా లాభాల స్వీకరణకు గురైన ఈ స్టాక్‌ ప్రస్తుతం 10.50శాతం లాభంతో రూ.3391.45 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 24.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ.44,724 కోట్లకు చేరింది. కంపెనీ ఈపీఎస్‌ 17.55, పీఈ 192.72గా ఉంది. 


ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ ప్రోత్సహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించడం, వివిధ బ్రోకరేజీ సంస్థలు BUY కాల్‌ ఇవ్వడంతో ఇవాళ భారీ లాభాలను నమోదు చేస్తోంది జుబిలెంట్ ఫుడ్స్‌. కంపెనీ మొత్తం ఆదాయం QoQ పద్ధతిలో 14శాతం క్షీణించి రూ.1037.85 కోట్ల నుంచి రూ.893.18 కోట్లకు పడిపోయింది. అలాగే నికరలాభం కూడా 35శాతం క్షీణతతో రూ.69.51 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్‌ 24.14శాతం నుంచి 23.77 శాతానికి పడిపోయింది. 


bse nse sensex nifty stock market telugu