గత వారం రోజులుగా జెఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్, మార్కెట్లలో పరుగులు పెడుతోంది. ఇవాళైతే ఏకంగా 13శాతం వరకూ కూడా పెరిగింది. ఈ మద్యకాలంలోనే ఈ స్టాక్ ధర కనీసం 30శాతానికిపైగానే పెరిగింది. ఇంతకీ ఇంతటి స్పీడ్ ఈ స్టీల్ స్టాక్‌లో ఎందుకంటే,టన్ను రేటు రూ.4000-రూ.4500 మధ్యకి రేట్లను పెంచుతూ జెఎస్డబ్ల్యూ స్టీల్ నిర్ణయం తీసుకుందని స్టీల్ మింట్ అనే వెబ్ పోర్టల్ చెప్తోంది. దీంతో ప్రస్తుతం టన్ను జెఎస్డబ్ల్యూ స్టీల్ ధర రూ.57,500-రూ.58000, అలానే హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ రేటు రూ.68,500 నుంచి 69000 వరకూ పలుకుతున్నట్లు తెలుస్తోంది
ఇదొక్కటే కాదు ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీలు, సెయిల్ కూడా టన్ను ధరలను రూ.4వేల వరకూ పెంచాయి. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇదే ఫస్ట్ హైక్. మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకే జెఎస్డబ్ల్యూ స్టీల్ 11.76శాతం పెరిగి రూ.628.40 రేటుని తాకింది. ఆ తర్వాత ఇంకా పెరిగింది.
ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు 9.67శాతం పెరిగి రూ. 616.60వద్ద ట్రేడ్ అయ్యాయ్