జిల్ జిల్ జియో..! అద్దిరిపోయిన ఆర్థిక ఫలితం..! రూ.3508కోట్ల నికరలాభం

2021-04-30 20:55:01 By Anveshi

img

టెలికాం రంగంలో జియో యుగం మరో కొత్త శిఖరాలకు చేరింది. మున్నెనడూ లేని విధంగా ఈ సంస్థ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్‌ రూ.138.2 గడించింది. దీంతో ఒక్కో వినియోగదారుడిపై ఈ స్థాయిలో ఆదాయం గడించడంతో, క్యు4లో బంపర్ ప్రాఫిట్ అనౌన్స్ చేసింది.  47.5శాతం వృద్ధితో  రూ.3508కోట్ల నికరలాభం ఆర్జించినట్లు ఫలితాల ప్రకటన సందర్భంగా సంస్థ వెల్లడించింది. ఒక్క ఆపరేషనల్ రెవెన్యూనే జియో 18,278కోట్ల రూపాయలను సంపాదించడం జియో జోరుకు చిన్న ఉదాహరణ

కరోనా కాలంలో అత్యద్భుతంగా పెట్టుబడులు రాబట్టిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, జియో రూపకల్పనతో ఓ ఫ్లాగ్‌షిప్ రెవెన్యూ మోడల్‌నే క్రియేట్ చేశారు.ప్రారంభించిన ఐదేళ్లలోనే సంస్థని ఈ స్థాయి రాబడి కలిగిన కంపెనీగా రూపొందించడం సాధారణ విషయం కాదు.  జియోప్లాట్‌ఫామ్స్‌పై దిగ్గజ సంస్థల ఇన్వెస్ట్‌మెంట్స్ రాబట్టడంలో రికార్డు క్రియేట్ చేసింది. అలానే ఇప్పుడు ఆర్థిక  ఫలితాల విషయంలోనూ జియో మరో ఘనత సాధించింది


గత ఏడాది క్యు4లో రూ.2379కోట్ల లాభం ఆర్జించిన జియో, తాజా నాలుగో త్రైమాసికంలో రూ.3508కోట్లలాభం గడించింది. దీనికి గత మూడు నెలల కాలంలో వచ్చి చేరిన 3.1కోట్లకిపైగా కొత్త కస్టమర్లే కారణంగా తెలుస్తోంది. జియోకి ఓవరాల్‌గా 42కోట్లకిపైగా కస్టమర్లు ఉన్నట్లు అంచనా, ఇంత పెద్ద బేస్‌తో జియో, తన టారిఫ్‌లు పెంచకుండానే, ఒక్కో యూజర్‌పై రూ.138.2 రెవెన్యూ ఆర్జించడం విశేషం. ఈ యూజర్లందరి డేటా వాడకం 1668కోట్ల జిగాబైట్లుగా సంస్థ ప్రకటించింది.
 


jio arup net profit telugu trade stock telecom

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending