క్రూడాయిల్ రేట్ 100 డాలర్లకి చేరుతుందట..మనకి పెట్రోల్ బాదుడు ఇంకా ఉందా..?

2021-02-22 17:43:28 By Anveshi

img

జెఫ్రీస్ రీసెర్చ్ సంస్థ ఈక్విటీ రీసెర్చ్ గ్లోబల్ హెడ్ అయినటువంటి క్రిస్టోఫర్ వుడ్ రాబోయే రోజుల్లో క్రూడాయిల్ ధరలు ఇంకా పెరుగుతాయంటున్నారు. అంతే కాదు అమెరికా బాండ్ మార్కెట్లలో సెల్లాఫ్ కంటిన్యూ అవుతుందని హెచ్చరిస్తున్నారు. పదేళ్లు,30ఏళ్ల బాండ్లపై రాబడి అంచనాలను మించి వరసగా 2.91శాతం, 3.17శాతంగా నమోదు కావడమే యూఎస్ బాండ్ మార్కెట్లలో అమ్మకాలకు కారణమంటున్నారాయన. అంతేకాదు గత రెండు వారాలుగా కన్పిస్తోన్న ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇది అమెరికాలో ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చని, బాండ్ రేట్లకు ఫెడరల్ బ్యాంక్ సపోర్ట్ చక్కగా ఉండటమే దోహదపడిందనేది ఆయన అభిప్రాయం.  దీంతో బాండ్ బుల్స్ పడినప్పుడల్లా కొందామనే ఆలోచనలో ఉంటారని, ఇలాంటి స్థితే 1980లలో ద్రవ్యోల్బణం తలెత్తినప్పుడు చోటు చేసుకుందని గుర్తు చేసారాయన.

తన గ్రీడ్ అండ్ ఫియర్స్ అనే నివేదికలో క్రూడాయిల్ ధరలపై కూడా తన అంచనాలను క్రిస్టోఫర్ వుడ్. రాబోయే రోజుల్లో బ్యారెల్‌కి 100డాలర్ల ధరని అందుకుంటుందని, ఇది ఇండియన్ మార్కెట్లకి షాక్ ఇస్తుందని జోష్యం చెప్పారు.ఇఁధన వినియోగం చైనాలో కొత్త గరిష్టాలకు చేరగా, భారత్‌లో కరోనా ముందటి దశకి చేరుకుంది.  అంతటా కలిపి రోజుకు ఇప్పుడు 94-95 మిలియన్ బ్యారెళ్ల వినియోగం అవుతున్నట్లు అంచనా. ఇది 2019 నాటి రికార్డ్ వినియోగమైన 100 మిలియన్ బ్యారెళ్లకి అతి దగ్గరగా వచ్చినట్లే. 

పై రెండు అంశాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో మన దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చు. అంటే నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. దాంతో పాటే ఆహార, ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు. ఈ పరిణామం స్టాక్ మార్కెట్లకి అంతగా రుచించకపోవచ్చు. ప్రసుత్తానికి క్రిస్టోఫర్ వుడ్ అంచనాలను బట్టి జరగబోయే పరిణామం మాత్రం ఇదే. 

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending