టాప్-3 ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

2022-01-13 08:40:01 By Marepally Krishna

img

TCS Q3 Results..
మూడో త్రైమాసికంలో 12.2శాతం వృద్ధితో రూ.9769 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం

అంతకుముందు ఏడాది ఇదే సమయంలో రూ.8701 కోట్లుగా ఉన్న టీసీఎస్‌ నికరలాభం

16.3శాతం వృద్ధితో రూ.42,015 కోట్ల నుంచి రూ.48,885 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం

ఒక్కో షేరుపై రూ.7 డివిడెండ్‌ను ప్రకటించిన టీసీఎస్‌, రికార్డ్‌ తేదీ జనవరి 20, చెల్లింపు తేదీ ఫిబ్రవరి 7

రూ.18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం

బైబ్యాక్‌ ధర ఒక్కో షేరు రూ.4500గా చొప్పున నిర్ణయించిన బోర్డు

బుధవారం ముగింపు ధరతో పోలిస్తే 16.6శాతం అధికంగా ఉన్న బైబ్యాక్‌ ధర

2021 క్యాలెండర్‌ ఇయర్‌ 25 బిలియన్‌ల ఆదాయ మైలురాయిని అధిగమించిన టీసీఎస్‌


Wipro Q3 Results..
డిసెంబర్‌ 31తో ముగిసిన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన విప్రో

వరుసగా ఐదో త్రైమాసికంలో మెరుగైన ప్రదర్శనను నమోదు చేసిన విప్రో

అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 1.3శాతం వృద్ధితో రూ.2969 కోట్లుగా నమోదైన విప్రో కన్సాలిడేటెడ్‌ నికరలాభం

29.6శాతం వృద్ధితో రూ.15670 కోట్ల నుంచి రూ.20313.6 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం

ఐటీ సేవల వ్యాపారం నుంచి ఈ త్రైమాసికంలో రూ.20,200 నుంచి రూ.20,600 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోన్న విప్రో

రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన విప్రో

వచ్చే 4 వారాలపాటు ఉద్యోగులకు వర్క్‌ ఫమ్‌ హోమ్‌ అమలు, పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం

గత 12 నెలల్లో 100 మిలియన్‌ డాలర్ల కంటే అధిక విలువైన 7 కొత్త ప్రాజెక్టులను దక్కించుకున్న విప్రో


Infosys Q3 Results..
మూడో త్రైమాసికంలో అంచనాలను మించిన ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.8శాతం వృద్ధితో రూ.5809 కోట్లుగా నమోదైన ఇన్ఫోసిస్‌ 

22.9శాతం వృద్ధితో రూ.31,867 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం

ఈ ఆర్థిక సంవత్సరంలో 19.5-20 శాతానికి ఆదాయ వృద్ధి అంచనాలు పెంచిన కంపెనీ

మూడో త్రైమాసికంలో రూ.19వేల కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్న ఇన్ఫోసిస్‌


BSE NSE SENSEX NIFTY STOCK MARKET TELUGU