iయ్యారే..! రోజూ 4% పెరుగుతోందే..! 52 వారాల గరిష్టానికి చేరినా పరుగు ఆగదా..?

2021-06-10 12:37:01 By Anveshi

img

ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గురువారం 10 శాతానికిపైగా పెరిగాయి. ఈ మద్యనే ఐఆర్‌బి ఇన్‌ఫ్రా కంపెనీలో హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ 1.4శాతం వాటా కొనుగోలు చేసింది. మొత్తం 49లక్షల40వేల షేర్లు ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడంతో ఈ సంస్థకి చెందిన  షేర్లు రోజూ పెరుగుతూ వస్తున్నాయ్. అలా గత 8 సెషన్లలో 31శాతం పెరిగింది 

 


ఇవాళ్టి ఇంట్రాడేలో రూ.139.40 ధరని చేరింది. ఇది ఈ స్టాక్‌కి 52 వారాల గరిష్టం.ఐతే ఈ స్థాయిని తిరిగి మధ్యాహ్నం 12.35కి అధిగమించింది రూ.144.20కి చేరింది.అలా ఇవాళ రెండుసార్లు తన 52 వీక్స్ హై ప్రైస్‌ను క్రియేట్ చేసినట్లైంది
 

మే 31నజూన్ 1న హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్, రెండు విడతలుగా వాటాలు కొనుగోలు చేయగా, మే 31న ఐఆర్‌బి ఇన్ఫ్రా ఉదయ్‌పూర్ హైవే ప్రాజెక్టు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ పద్దతిలో ఐఆర్‌బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్విట్ ట్రస్ట్‌ కిందకు వచ్చినట్లు ప్రభుత్వం కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిపింది. దీంతో ఇక్కడి టోల్ రేట్లను 55శాతం పెంచుకునేందుకు వెసులుబాటు దక్కింది. 

 

ప్రస్తుతం ఐఆర్‌బి ఇన్ఫ్రా షేర్లు 8.79శాతం పెరిగి రూ.141.10 వద్ద  ట్రేడ్ అయ్యాయ్
 


iRB INFRA RALLY UDAYPUR TOLL RATES COMPLETION CERTIFICATE PRIVATE INVIT GAINERS RALLY TELUGU PROFIT

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending