డిజిన్వెస్ట్‌మెంట్ రూటు దొరికిందా?దౌడ్ తీస్తోన్న ఐడిబిఐ షేర్లు! 8% జంప్

2021-04-13 11:42:10 By Anveshi

img

ప్రవేటైజేషన్ బాట పట్టే బ్యాంకులేవో మెల్లగా బైటకు వస్తోంది. ముందుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఆ జాబితాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నారు. సెంట్రల్ బ్యాంక్  పేరు కూడా విన్పించింది. ఐతే  ఈ మధ్యనే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ చట్రం నుంచి తప్పించబడిన ఐడిబిఐ పేరు అనూహ్యంగా ముందుకు వచ్చేసింది. ఇందులో 45.5శాతం వాటాలను విక్రయించేందుకు కేంద్రం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందనే గాసిప్ ఇప్పుడు నడుస్తోంది. ఇది వాస్తవరూపం దాల్చేనాటికే షేర్లు పరుగులు పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే ఇవాళ ఇంట్రాడేలో ఐడిబిఐ 8 శాతానికిపైగా పెరిగి 36.50కి ఎగసాయి

 

 దీపం( డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) విభాగం ఈ వాటాల అమ్మకాన్ని  పర్యవేక్షించబోతుందంటూ బిజినెస్ స్టాండర్డ్ స్టోరీ పబ్లిష్ చేసింది. దీంతో ఈ బ్యాంక్ షేర్లు ఇంట్రాడేలో దౌడ్ తీసాయ్. దీపం  వాటాల విక్రయాన్ని నిర్ధారించినా, కేంద్రకేబినెట్ ఫైనల్ అప్రూవ్ కానిదే అది కార్యరూపం దాల్చదు.  అందుకే ఇప్పుడు కేబినెట్ నిజంగానే ఆ నిర్ణయం తీసుకుందా లేదా అనేది అధికారికంగా తెలీదు


ఐడిబిఐ షేర్లు ప్రస్తుతం 5.92శాతం పెరిగి రూ.35.80 వద్ద ట్రేడ్ అయ్యాయ్


dipam disinvestment idbi rally intraday nifty50 reality pharma bank nifty sensex telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending