30శాతం పెరిగిన ICICI ప్రాఫిట్

2021-10-23 22:21:37 By Y Kalyani

img

30శాతం పెరిగిన ICICI ప్రాఫిట్

ప్రైవేట్ రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒక్కటైన ఐసీఐసీఐ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 30 శాతం పెరిగింది. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ త్రైమాసికానికి రూ.5,511 కోట్ల నిక‌ర లాభాన్ని ప్రకటించింది. గ‌తేడాది ఇదే కాలానికి అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో రూ.4,251 కోట్లుగా ఉంది. వ‌డ్డీ ఆదాయం 24.8 శాతం పెరిగింది. మొత్తం రూ.11,690 కోట్లకు చేరింది. గ‌తేడాది ఇదే సమీక్షా కాలానికి వ‌డ్డీపై నిక‌ర ఆదాయం రూ.9,366 కోట్లుగా ఉంది. నెట్ NPAలు త‌గ్గాయి. జూన్ త్రైమాసికం నాటికి మొండి బ‌కాయిలు రూ.9,306 కోట్లు ఉండగా.. సెప్టెంబ‌ర్ నాటికి రూ.8,161 కోట్ల‌కు తగ్గాయి. మొత్తం NPAలు 1.16 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గాయి.


icici q2 result latest news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending