గ్లాండ్ ఫార్మా గ్రాండ్ రిజల్ట్స్..! 52 వీక్స్ హై టచ్ చేసిన షేర్లు! ఇంట్రాడేలో రూ.260 ప్రాఫిట్

2021-05-18 11:50:59 By Anveshi

img

హైదరాబాద్ బేస్డ్ జెనెరిక్ ఇంజెక్టబుల్ ఫార్ములేషన్స్ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ మార్కెట్లలో ఇరగదీసింది. ఇంట్రాడేలో దాదాపు పదిశాతం వరకూ పెరిగి రూ.3061ధరని తాకింది. ఇది ఆ స్టాక్ 52 వీక్స్ హై ప్రైస్ కావడం విశేషం.నిన్న ప్రకటించిన  FY21 Q4 రిజల్ట్స్  అదరగొట్టడంతోనే  మార్కెట్లలో ఈ ర్యాలీకి కారణంగా చెప్తున్నారు

B2B ఫార్మా వ్యాపారం చేసే గ్లాండ్ ఫార్మా క్యు4లో రూ.260.4 కోట్ల మేర కన్సాలిడేటెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. 40శాతానికిపైగా పెరిగిన నికరలాభంతో పాటు గత ఏడాది క్యు4లో నమోదైన రూ.635.2 కోట్ల నుంచి రూ.887.7కోట్లకి మొత్తం రెవెన్యూ జంప్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

 

ఈ రిజల్ట్స్‌కి తోడు ప్రస్తుతం దేశంలో రష్యన్ మేడ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ, సరఫరా కోసం ఒప్పందం కుదిరిన సంస్థలలో గ్లాండ్ ఫార్మా కూడా ఒకటి. మొత్తం 252 మిలియన్ డోసులు అంటే పాతిక కోట్లకిపైగా డోసులు ఉత్పత్తి కోసం డీల్ సెట్  కావడంతో , ఈ సంస్థ అమ్మకాలకు రూ.1500కోట్ల మేర అదనంగా చేరతాయని, షేరు వేల్యూకి 200 రూపాయలు అదనంగా  కలవవచ్చని గత మార్చి నెలలో యాక్సిస్ సెక్యూరిటీస్ రికమండ్ చేసింది.అప్పట్లో ఈ సంస్థ షేరు రూ.2879గా ట్రేడ్ అయింది. ఇప్పుడు ఆ రెండు వందల రూపాయలు కూడా పెరగడంతో నెక్ట్స్ ఏంటనే ఎంక్వైరీలు ప్రారంభం కావడం సహజం

 

ప్రస్తుతం గ్లాండ్ ఫార్మా షేర్లు  బిఎస్ఈలో 7.92శాతం పెరిగి రూ.3014 వద్ద ట్రేడ్ అయ్యాయ్


GLAND PHARMA RALLY RISE RESULTS TELUGU PROFIT TRADE

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending