జీడీపీల అంచనాలు మరిచిపోండి అంటున్న ఏజెన్సీలు

2021-05-05 09:17:10 By Y Kalyani

img

జీడీపీల అంచనాలు మరిచిపోండి అంటున్న ఏజెన్సీలు

దేశంలో కరోనాసెకండ్ వేవ్ నేపథ్యంలో స్థానిక లాక్‌డౌన్లు మొదటి FY22 Q1 జీడీపీని భారీగా పడిపోయేలా చేస్తామని ప్రకటించాయి రేటింగ్ ఏజెన్సీలు. స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ ఇప్పటికే  తేల్చి చెప్పగా తాజాగా గోల్డ్‌మాన్‌ శాక్స్‌ కూడా ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాను 11.1 శాతానికి కుదించింది. యూబీఎస్‌ యాక్టివిటీ ఇండికేటర్‌ ఏప్రిల్‌లో 7 శాతం దిగజారింది. గత ఏడాది ఏప్రిల్‌లో 25.5 శాతం క్షీణించింది.
ముంబైలాంటి మహానగరాల్లో కార్యకలాపాలు లేవు. మే నెలలో లాక్‌డౌన్లు ఇంకా పెరుగుతున్నాయి. కర్నాటక, గోవా, హరియాణా, ఢిల్లీ సహా అనే పారిశ్రామిక ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టారు. దీంతో జీడీపీ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. వాహన రిజిస్ట్రేషన్లు, ఈ-వే బిల్లులు, ప్రయాణికుల ట్రాఫిక్‌, విద్యుత్‌ డిమాండుపై ప్రభావం పడింది. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 11.1 శాతానికే పరిమితం అవుతుందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనా వేసింది. కరోనా అదుపులోకి వచ్చి ఆంక్షలు సడలించినట్టయితే మూడో త్రైమాసికంలో పుంజుకోవచ్చునని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్‌ సంస్థలు జీడీపీ అంచనాలు కుదించిన నేపథ్యంలో ఈ తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


gdp market stocks trading

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending